స్వచ్ఛ తెలంగాణే లక్ష్యం


Tue,September 17, 2019 11:57 PM

మిరుదొడ్డి : స్వచ్ఛ తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని జాయింట్ కలెక్టర్ పద్మాకర్ అన్నారు. మంగళవారం మండలంలోని లక్ష్మీనగర్, లింగుపల్లి, చెప్యాల గ్రామాల్లో పర్యటించి పల్లె ప్రగతి పనుల పురోగతిని పరిశీలించారు. ముందుగా లక్ష్మీనగర్‌లో ఎంపీపీతో కలిసి ఇంటింటికీ తిరిగారు. ఎక్కడా చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని సర్పంచ్ పిట్ల సత్యనారాయణ, కార్యదర్శి సంతోశ్‌కు సూచించారు. గ్రామ ప్రత్యేక అధికారి డాక్టర్ మంజుల ఆలస్యంగా రావడంపై ఆగ్ర హం వ్యక్తం చేస్తూ 30 రోజుల పల్లె ప్రగతి ప్రణాళిక పనులు పూర్తయ్యే వరకు సమయపాలన పాటించాలని హెచ్చరించా రు. ప్రాథమిక పాఠశాల శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎంకు సూచించారు. అనంతరం లింగుపల్లిలో పర్యటించారు. గ్రామంలో పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని సర్పంచ్ జోగ్గారి బాల్‌నర్సయ్య, కార్యదర్శిని ప్రశ్నించారు. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు ఎంపీపీ గజ్జెల సాయిలుతో కలిసి స్వయంగా భోజనం వడ్డించారు. విద్యార్థులకు వడ్డించే భోజనంలో ఎక్కడా తేడాలు రావద్దని పాఠశాల సిబ్బందిని హెచ్చ రించారు. గ్రామంలోని ప్రజలతో మాట్లాడుతూనే ఇండ్లలోకి వెళ్లి పనికి వస్తువులను ఉంచుకోవడం వల్ల దోమలు వృద్ధి చెంది వ్యాధులకు కారణమవుతాయని వివరించారు. చెప్యాల గ్రామంలో వీధుల్లో తిరగుతూ పాత ఇండ్లు, ప్రమాదకరంగా మారిన బావులను పూడ్చి వేయడానికి ముందుకు యజమా నులకు నోటీసులుఅందజేసి, తొలగించాలని గ్రామ ప్రత్యేక అధికారి మనోజ్‌కుమార్, ఎంపీడీవో సుధాకర్‌రావును ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి, విద్యార్థుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి సంతకం చేశారు. గ్రామ పంచాయతీలో ఎంపీపీ, సర్పంచ్ మాచపురం లక్ష్మి, అధికారులు వార్డు సభ్యులతో కలిసి 30 రోజులు ప్రణాళిక అమలుపై చర్చించారు. గ్రామ అభివృద్ధి రూ.20 లక్షలను మంజూరు చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎక్కడైనా చెట్లు తొలచాల్సి వస్తే వాటి స్థానం తో మరో స్థలంలో మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. చెప్యాల గ్రామంలోని 552 సర్వే నెంబర్‌లో ఉన్న భూమిని గ్రామపంచాయతీకి చెందేలా తహసీల్దార్ పద్మారావు చర్యలు తీసుకోవాలని జేసీ పద్మాకర్ ఆదేశించారు.
మిరుదొడ్డి మండలంలోని రైతుల భూసమస్యలను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందితో సమావేశమై సూచనలు చేశారు. రైతుల నుంచి భూ సమస్యలపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ అహ్మద్, సర్పంచ్‌లు, ప్రత్యేకాధికారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి..
దౌల్తాబాద్ : మండలకేంద్రం దౌల్తాబాద్‌లో జేసీ పద్మాకర్ పర్యటించి, పనులను పరిశీలించారు. మురుగునీటి కాలువల ను శుభ్రం చేయాలని, చెత్తాచెదారం తొలగించాలని, పాత బా వులు, ఇండ్లు కూల్చివేయాలని ఆదేశించారు. పరిసరాల పరి శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులు, ప్ర జాప్రతినిధులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెం కన్న, ఎంపీడీవో మశ్చేందర్, తహసీల్దార్ సత్యనారాయణ, ఏవో గోవిందరాజులు, ప్రత్యేకాధికారి వెంకయ్య ఉన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...