దొరుకునా ఇటువంటి సేవ..


Tue,September 17, 2019 11:56 PM

సిద్దిపేట టౌన్: సమాజ సేవకు పరితపించే సైనికుడు.. అన్నదాతల ఆకలి తీర్చే సేవాతత్పరుడు..ఆధ్యాత్మిక, ధార్మికకు కేరాఫ్.. పర్యావరణ ప్రేమికుడు.. గోసంరక్షకుడు.. సేవ అయిన.. దాతృత్వమైన..దైవ సంకల్పంగా భావించి అంకుఠిత దీక్షతో చేపట్టే అనితర సాధ్యుడు, మృదుస్వభావి, స్నేహశీలి మురంశెట్టి రాములుకు అరుదైన అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా తెలంగాణ సర్కారు టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించాలని ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు టీటీడీ బోర్డు సభ్యులుగా నియామకమయ్యారు. సిద్దిపేట పట్టణానికి చెందిన మురంశెట్టి రాములు చిన్నప్పటి నుంచే సామాజిక సేవకు పరితపించాడు. నలుగురితో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. అదే ఆనవాయితీని అనునిత్యం కొనసాగిస్తూ సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేశాడు. వృత్తి రీత్యా ఆయిల్ మిల్ వ్యాపారం చేస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగించాడు. సిద్ధ రామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలకు ఫౌండేషన్ ద్వారా చేపట్టాడు. రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను నిర్వహించి తనదైన సేవా భావాన్ని చాటారు.

సమాజ సేవలో..
వేసవి కాలంలో అంబలి పంపిణీ, పశువుల అంగట్లో రైతులకు అన్నప్రసాద వితరణ, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని అన్నదానం చేపట్టడం, వడదెబ్బ నివారణ మందుల పంపిణీలోను తనదైన శైలిని కనబర్చారు. గోసేవలో లీనమయ్యేవాడు. స్వతహాగా గోసేవకుడైన రాములు గోశాలను ఏర్పాటు చేసి గోవులను సంరక్షిస్తున్నాడు. గోవులకు సీమంతాలు, పుట్టిన లేగదూడలకు బారసాల నిర్వహించి వాటికి నామకరణం చేపడుతున్నాడు. విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలు, యూనిఫామ్‌లను అందిస్తూ విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నారు.

ఆధ్యాత్మిక, ధార్మిక సేవల్లో తనదైన ముద్ర
ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో మురంశెట్టి రాములు ముమ్మరంగా పాల్గొన్నారు. దైవభక్తి ఎక్కువగా ఉన్న ఆయన సిద్దిపేటలో వినాయక ఆలయాన్ని నిర్మించారు. గణేశ్ సేవా సమితిని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలకు తనవంతు సహాయ సహకారాలు అందించారు. కాణిపాకం ఆలయ పాలకవర్గ సభ్యుడిగా పనిచేశారు.

పర్యావరణ పరిరక్షణకు సైతం..
పర్యావరణానికి కీడు చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నెలకొల్పవద్దని గట్టిగా ప్రచారం చేసేవారు. స్వతహాగా మట్టి వినాయకులను తయారు చేసి ప్రజలకు పంపిణీ చేశారు. కాలక్రమేణా మట్టి వినాయకుల కంటే మేలు చేసే గోమయ గణపతులను తయారు చేసి రాష్ట్రంలోనే మొదటి వ్యక్తిగా నిలిచారు.

సీఎం కేసీఆర్‌తో ప్రత్యేక అనుబంధం
సిద్దిపేట ముద్దుబిడ్డ, సీఎం కేసీఆర్‌తో రాములుకు ప్రత్యేక అనుబంధం ఉంది. సిద్దిపేట ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉన్నప్పటి నుంచి ఆయన వెంటే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రెండు దఫాల ఎన్నికల్లో ప్రత్యేకంగా రాములు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సంచార చలివేంద్రం ప్రచార రథాలు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రత్యేకంగా ప్రచార రథాలను ఏర్పాటు చేసి సిద్దిపేట,గజ్వేల్‌లో సంక్షేమ పథకాలను వివరించారు. ఇప్పటివరకు సిద్దిపేట మార్కెట్ వైస్ చైర్మన్, లారీ ఓనర్స్, ఆయిల్ మిల్లర్స్, గోల్డెన్ వెల్ఫేర్ అసొసియేషన్ అధ్యక్షుడిగా, వైశ్య సంక్షేమ సమితి కన్వీనర్‌గా పనిచేశారు.

ప్రస్తుత పదవులు
వైశ్య సంక్షేమ సమితి సిద్దిపేట ట్రస్టు, ఆయిల్ మిల్లర్స్ అండ్ డీలర్స్, గణేశ్ సేవా సమితి శాశ్వత గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కాణిపాక ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం, కాణిపాక ఆంధ్రప్రదేశ్ దేవస్థాన, గణేశ్ దీక్షా ప్రచారకుల జాయింట్ సెక్రటరీ, అరుణచలేశ్వర ఆర్యవైశ్య నిత్యాన్నదాన ట్రస్టు, గణపతి దీక్షా సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షునిగా, సిద్ద రామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.

సామాజిక సేవా కార్యక్రమాలు
రూపాయికి రొట్టె, రూపాయికి పప్పు, సంచార చలివేంద్రాలు, జనం దగ్గరికి జలం, మీకు చెత్త మాకు కొత్త, నిరుపేద వధువులకు పుస్తెమట్టెల అందజేత, పేదలకు బట్టల పంపిణీ, హరితహారం, బడిబాటతో తల్లిదండ్రులు, పిల్లల్లో చైతన్యం చదువుకో బతుకు మార్చుకో, అర్బన్ హెల్త్ సెంటర్‌లో సేవలు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...