చట్టాల పై అవగాహన అవసరం


Tue,September 17, 2019 11:55 PM

సిద్దిపేట టౌన్ : పోలీసులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ అన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో బ్లూకోట్స్ పోలీస్ సిబ్బందికి ఒక రోజు శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్లూకోట్స్ విధులు నిర్వహించే పోలీసులు క్రమశిక్షణ, సమయపాలన, వృత్తిపట్ల నిబద్ధత, విధేయత కలిగి ఉండాలన్నారు. అందరి మధ్య సహకారం, సమన్వయంతో విధులు నిర్వర్తించాలని చెప్పారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలన్నారు. నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలన్నారు. సాంకేతికతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, నూతన సాంకేతికతను పోలీసులు వినియోగించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ నిజాయితీగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. డయల్ యువర్ 100కు వచ్చే ఫోన్‌కాల్స్‌పై తక్షణమే స్పందించాలన్నారు. ఆధునిక టెక్నాలజీ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

నేర ప్రదేశాలను గుర్తించాలి..
తరచూ నేరాలు జరిగే ప్రదేశాలను హాట్‌స్పాట్స్‌గా గుర్తించి గట్టి బందోబస్తు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ అన్నారు. విడుతల వారీగా విధులు నిర్వర్తించి అందుకనుగుణంగా రూట్‌మ్యాప్ యాడ్ చేసుకోవాలని సూచించారు. అసాంఘిక శక్తులు, నేరస్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. నేరాల నియంత్రణకు ముందు జాగ్రత్తగా పోలీసులు విధులు నిర్వర్తించాలని తెలిపారు. ప్రజలతో సత్సంబంధాలు పెంచుకొని నేరాలను నియంత్రించాలన్నారు. ప్రజలకు పోలీసు శాఖ చేపట్టే కార్యక్రమాలను తెలియజేయాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తూ అన్ని విషయాలను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. నేను సైతం కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసిన కెమెరాలను తరచూ తనిఖీలు చేయాలన్నారు. హాక్‌హై, ఫేస్‌బుక్, వాట్సాప్ మొదలైన వాటి వినియోగం గురించి ప్రజలను చైతన్యపర్చాలన్నారు. జైలు నుంచి విడుదలైన వ్యక్తుల యొక్క కార్యక్రమాలపై నిఘా ఉంచాలన్నారు. అనుమానితులు, సస్పెక్ట్‌లు, రౌడీలపై నిరంతరం వారి కదలికలను గుర్తించాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్, బందోబస్తు విధులు, సోషల్ మీడియా, క్రైమ్ ప్రివెన్షన్, నేర నియంత్రణ తదితర అంశాలపై సీపీ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐటీ కోర్ సిబ్బంది శశికాంత్, శ్రీధర్, బ్లూకోట్స్ సిబ్బంది పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...