ముఖ్యమంత్రి కలల ప్రాజెక్టు మల్లన్నసాగర్


Mon,September 16, 2019 11:54 PM

కొండపాక : ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు మల్లన్నసాగర్ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కొండపాక మండలం ఎర్రవల్లి, వేములఘట్ గ్రామాల్లో జరుగుతున్న మల్లన్నసాగర్ నిర్మాణ పనులను మంత్రి నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరువుకాటకాలు లేని తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులను ప్రారంభించారన్నారు. రికార్డు స్థాయి వేగంతో నిర్మాణాలను పూర్తి చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు, రైతులకు నీటిని అందించేందుకు ఉరకలేస్తోందన్నారు. తెలంగాణ సాగునీటి వప్రదాయిని మల్లన్నసాగర్‌తో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావడం ఎంతో దూరంలో లేదన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్ అద్భుతమైన అనుభవంతో ప్రాజెక్టును డిజైనింగ్ చేసి తెలంగాణలోని ప్రతి గ్రామానికి సాగునీరు చేరేలా ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. మల్లన్నసాగర్ జలాలతో హైదరాబాద్‌కు తాగునీరు లక్షల ఎకరాలను సాగునీరు అందుతుందని భూగర్భ జలాలు పెరిగి కరువులేని తెలంగాణ సాక్షాత్కారమవుతందన్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వతో భూగర్భ జలాల స్థాయి పెరుగుతుందన్నారు. మల్లన్నసాగర్ నిర్మాణం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆదర్శ రైతు రాజిరెడ్డికి అభినందన..
ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడిని సాధిస్తున్న ఆదర్శ రైతు అమ్మన రాజిరెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. కొండపాక మండలం బందారం గ్రామ శివారులో రాజిరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రైతు అమ్మన రాజిరెడ్డి అవలంబిస్తున్న ఆధునిక వ్యవసాయసాగు పద్ధతులు అందరికి ఆదర్శమన్నారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించడంతో పాటు అధిక దిగుబడిని సాధిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మల్లన్నసాగర్ ఈఈ సత్యవర్దన్, డీఈ రవీందర్, ఈఈలు దినేశ్, రాజేందర్ అనిత, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, ఎండపాక ఎంపీపీ సుగుణ, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ర్యాగల్ల దుర్గయ్య, వ్యవసాయ విస్తరణ అధికారి ఖైసర్‌బీ తదితరులు పాల్గొన్నారు.

మల్లన్న సాగర్‌తో సస్యశ్యామలం
తొగుట: తెలంగాణలో సాగునీటిని అందించడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాడని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలో నిర్మిస్తున్న మల్లన్న సాగర్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సముద్రంలో వృథాగా వెలుతున్న కృష్ణ, గోదావరి జలాలను ప్రాజెక్టుల ద్వారా అడ్డుకట్టలు వేసి, ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించడం తెలంగాణ సాగునీటి రంగంలో అద్భుత ఘట్టమని ఆయన పేర్కొన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు మూలంగా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు పరిసర ప్రాంత జిల్లాల్లోని తాగు, సాగునీటి అవసరాలు తీరుస్తున్నామన్నారు. రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ సందర్భగా ఇంజినీర్లతో, కాంట్రాక్టర్లతో పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...