పల్లె ప్రగతితో మారుతున్న గ్రామాల రూపురేఖలు


Mon,September 16, 2019 11:53 PM

మిరుదొడ్డి : సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన 30 రోజుల పల్లె ప్రగతి పనులతో అన్ని గ్రామాల్లో రూపు రేఖలు మారిపోతున్నాయని ఎంపీపీ గజ్జెల సాయిలు అన్నారు. సోమవారం మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో 30 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమాలు సర్పంచ్‌లు, ప్రత్యేక అధికారుల సమక్షంలో జోరుగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఎంపీపీ అందెలో ఎంపీడీవో పి.సుధాకర్ రావుతో కలిసి చెత్తా, చెదారాన్ని తొలింగించి వేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టి పథకంతో గ్రామాలు నేడు ఎంతో సుందరంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో పాత ఇండ్ల గోడలను కూల్చి మట్టిని తరలించడంతో, ప్రమాదకరంగా ఉన్న పాడు బడిన బావులు పూడ్చివేసి చెత్తా చెదారాన్ని తొలిగిండచంతో పరిశుభ్రమైన గ్రామాలు అందంగా రూపు దిద్దుకుంటాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ చుక్క శంకర్, ఎంపీటీసీ లలిత, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో ఉద్యమంలా ప్రగతి పనులు
దుబ్బాక,నమస్తే తెలంగాణ : దుబ్బాక నియోజకవర్గంలో పల్లెపల్లెనా పారిశుధ్య పనులు జోరందుకున్నాయి. సీఎం కేసీఆర్ పిలుపుతో ఊరువాడలను పరిశుభ్రంగా మార్చుతున్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు కథా నాయకులుగా మారి స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుకుంటున్నారు. దుబ్బాక నియోజకరవ్గంలో 30 రోజుల ప్రణాళిక పనులు ఉద్యమంలా కొనసాగిస్తూ..ప్రగతి సాధిస్తున్నారు. సోమవారం దుబ్బాక మండలంలో అన్ని గ్రామాల్లో ప్రగతి పనులు జోరందుకున్నాయి. ఎనగుర్తి, పోతారెడ్డిపేట, పోతారం, పెద్దగుండవెళ్లి గ్రామాల్లో మురికి కాల్వలను శుభ్రపరిచి, పిచ్చిమొక్కలు తొలిగించారు. గ్రామాల్లో ప్రజలను చైతన్య పరిచి 30 రోజుల ప్రణాళికలో భాగస్వాములను చేస్తున్నారు. గ్రామాల్లో పూరాతన ఇండ్లను కూల్చివేయటంతో పాటు ప్రమాదకరంగా ఉన్నా బావులను పూడ్చేస్తున్నారు. ఎనగుర్తిలో సర్పంచ్ శంకర్ ఆధ్వర్యంలో గ్రామంలో పిచ్చి మొక్కలు తొలిగింపు కార్యక్రమం చేపట్టారు. పెద్దగుండవెళ్లి, తిమ్మాపూర్,రాజక్కపేట, చిట్టాపూర్, చౌదర్‌పల్లి, రామేశ్వరంపల్లి, నగరం, తాళ్లపల్లి తదితర గ్రామాల్లో పారిశుధ్యపనులు నిర్వహించారు.

పకడ్బందీగా..30 రోజుల ప్రణాళిక
తొగుట : గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం అమలు చేసిన 30 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు ఎంపీడీవో రాజిరెడ్డి తెలిపారు. మండలంలోని వెంకట్‌రావుపేటలో సోమవారం ఎంపీటీసీ కంకనాల నర్సింహులుతో కలిసి పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు. 30 రోజుల్లో జోష్‌గా కార్యక్రమాలు చేపట్టాలని, చెత్తా, చెదారం కనిపించవద్దని, పిచ్చి మొక్కలు తొలింగాచలని, పాత ఇండ్లు, గోడలు తొలిగించాలన్నారు. జప్తిలింగారెడ్డిపల్లిలో పాడుబడిన ఇళ్లను పరిశీలించిన ఎంపీవో, సర్పంచ్ చిలువేరి జ్యోతి మల్లారెడ్డి, సురేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గుడికందులలో ప్రత్యేకాధికారి రఫీ, సర్పంచ్ గంగనిగల్ల మల్లయ్య, కార్యదర్శి ఇందిరారాణి ఆధ్వర్యంలో పిచ్చి మొక్కలు తొలిగించి, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. జేసీబీ ద్వారా పాత ఇండ్లను, గోడలను తొలిగించారు. పల్లెపహాడ్‌లో ప్రత్యేకాధికారి డా.రాజేందర్‌రెడ్డి, సర్పంచ్ గుగ్లోతు చిన్న రజిత, ఉప సర్పంచ్ లలిత ఆధ్వర్యంలో పారిశుధ్య చర్యలు చేపట్టారు. ఉత్సాహంగా ప్రణాళిక పనులు
దౌల్తాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 30 రోజల ప్రగతి ప్రణాళికకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. సోమవారం మండలంలో సర్పంచ్ అది వెంకన్న అధ్వర్యంలో గ్రామాల్లో అధికారులు, మహిళలు ప్రజా ప్రతినిధులు యువకులు వీధులల్లో ఉన్న పిచ్చి మొక్కలను, చెత్తను ఊడ్చి శుభ్రం చేశారు. పారిశుధ్య పనులను ఎంపిడీవో మశ్చేందర్ పరిశీలించారు. సూరంపల్లి గ్రామంలో పనులు పక్కగా జరుగుతున్నాయని సర్పంచ్ అయ్యాంగారి నర్సింహలు అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు, ఎంటీటీసీ ఆది వనిత, సత్యం,గంగాధరి రవీందర్, ముత్యం గారి యదగిరి పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...