క్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది


Mon,September 16, 2019 11:53 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: క్రీడలతో స్నేహభావం పెంపొందడమే కాకుండా విద్యార్థులకు క్రమశిక్షణ అలవడుతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం హుస్నాబాద్‌లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన ఎస్‌జీఎఫ్ క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు కేవలం విద్యకు మాత్రమే పరిమితం కాకుండా క్రీడల్లోనూ రాణించాలన్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉత్తమ మార్కులు సాధించాలన్నారు. విద్యార్థులు తమకు ఇష్టమైన క్రీడలో నిరంతర సాధన చేయడం ద్వారా రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ రాణించాలన్నారు. ఎస్‌జీఎఫ్ మండల స్థాయిలో రాణించిన విద్యార్థులు జిల్లా స్థాయిలోనూ రాణించి తమ ప్రతిభను చాటుకోవాలన్నారు. అనంతరం వివిధ అంశాల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, ఎంపీపీ లకావత్ మానస, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, హెచ్‌ఎంలు బండారి మనీల, ఎస్. వెంకటయ్య, కిషన్‌నాయక్, మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి, ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లయ్య, వ్యాఖ్యాత కక్కెర్ల రవీందర్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...