ప్రగతి పల్లెలు


Sun,September 15, 2019 10:42 PM

-గ్రామాల్ల్లో జోరుగా 30 రోజుల కార్యక్రమం
-వీధివీధినా స్వచ్ఛత- పరిశుభ్రత పనులు
-పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
-సర్పంచ్‌లు, ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ
-ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించాలని పిలుపు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మన గ్రామంలో భాగంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఆదివారం నాటికి 10వ రోజుకు చేరాయి. జిల్లావ్యాప్తంగా గ్రామసభలు, సమావేశాలు పండుగ వాతావరణంలో జరిగాయి. కో-ఆప్షన్ సభ్యులు, సర్పంచ్‌ల ఆధ్వర్యం లో గ్రామసభలను నిర్వహించారు. మండల, జిల్లాస్థాయి అధికారుల తోపాటు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి, సమస్యలను గురి ్తంచారు. స్వగ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని గ్రామస్తులు ప్రతిజ్ఞ చేస్తున్నారు. గ్రామాల్లో 30 రో జుల ప్రణాళిక వేగవంతం చేయడానికి సర్పంచ్‌లు నిరంతరం పని చేస్తు న్నారు. ఆయా గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రజలకు వివరిస్తున్నారు. పాత ఇండ్లు, కూలిన గోడలను జేసీబీ యంత్రాలతో కూల్చి వేస్తున్నారు.

అలాగే, విష జ్వరాలు ప్రబలుతున్న తరుణంలో పారిశుధ్య నిర్వహణ పనులను చేపడుతున్నారు. మురుగునీటి కాలువల్లో పూడిక తీయిస్తూ.. శుభ్రం చేయిస్తున్నారు. అలాగే, ఇండ్లలో ఉన్న నీటి నిల్వ లను తొలిగిస్తున్నారు. రోడ్లు, వీధుల్లో ఉన్న చెత్తాచెదారాన్ని తీసేస్తు న్నారు. దీంతో గ్రామస్తులు శ్రమదానం చేపట్టి, గుంతలు పడిన రోడ్లు, రహదారులను మట్టితో నింపి పూడ్చుతున్నారు. కొన్ని గ్రామాల్లో హరితహారం చేపట్టి, మొక్కలు నాటుతున్నారు. రహదారుల వెంబడి ఉన్న పిచ్చిమొక్కలను నరికి వేస్తున్నారు. అలాగే, నీటి వనరుల పరిరక్షణ తోపాటు రక్షిత తాగునీటిపై అవగాహన కల్పించారు. కొన్ని రోజులుగా జరుగుతున్న పనులతో గ్రామాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. పరిశుభ్రంగా మారిన రహదారులు, చెత్తచెదారం లేని వీధులతో పల్లెల్లో ప్రగతి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. శిథిలావస్థకు చేరిన ఇండ్లు, గోడలు, భవనాలను కూల్చివేస్తున్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...