ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను సంరక్షించాలి


Sun,September 15, 2019 10:32 PM

సంగారెడ్డి అర్బన్, నమస్తేతెలంగాణ : ప్రభుత్వం అడవులను పెంచేందుకు చేపట్టిన హరితహారం హర్షణీయమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని గురు గంగాధ శివాచార్యులు అన్నారు. ఆదివారం సదాశివపేట మండల పరిధిలోని తంగెడపల్లి జంగమయ్యగుట్ట కోఠి బిలేశ్వరలింగం మఠం ఆశ్రమ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ మొక్కలను పట్టణంలోని ఎడ్లబజార్ వీరశైవ సమాజం అధ్యక్షుడు ముద్ద నాగనాథ్ దంపతులు ఏకబిల్వ వృక్షం(పత్రి) మొక్కను స్వామివారికి అందజేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అడవులను పెంచడానికి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

అడవులు విశాలంగా ఉంటే సకాలంలో వర్షాలు కురిసి తాగు, సాగు నీటి ఇబ్బందికి కొరత ఉండదని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షణ చేపడితే భవిష్యత్‌లో చెట్లుగా ఎదిగి పండ్లు, ఫలాలు ప్రజలకు అందించడంతోపాటు స్వచ్ఛమైన గాలిని ప్రసాదిస్తుందన్నారు. కోఠి బిల్వేశ్వర లింగం మఠం ఆశ్రమంలో 51మొక్కలను నాటడం సంతోషకరమని నాగనాథ్ దంపతులను అభినందించారు. అనంతరం స్వామివారికి శాలువా కప్పి సన్మానం చేశారు. కార్యక్రమంలో శివయోగి శివాచార్యులు, విశ్వనాథం, వంశీ, చందు, బక్కయ్య పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...