పూర్ణకృష్ణకు ఉత్తమ భాషోపాధ్యాయ అవార్డు


Sun,September 15, 2019 10:31 PM

సంగారెడ్డి చౌరస్తా : రెండు దశాబ్దాలకు పైగా సేవలందిస్తున్న భాషోపాధ్యాయుడు పూర్ణకృష్ణకు అరుదైన గౌరవం లభించింది. గురుపూజోత్సవం, భాషోపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అస్థిత్వం సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 12మందిని ఉత్తమ భాషోపాధ్యాయులుగా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో భాషోపాధ్యాయుడు పూర్ణకృష్ణను శాలువా, మెమొంటోతో సత్కరించారు. ఇప్పటికే ఐదు పుస్తకాలు, నాలుగు శతకాలు, అనేక సాహితి సంపదలను వెలువరించిన పూర్ణకృష్ణను నిర్వాహకులు సన్మానించి పుస్తకాలను అందజేశారు. రెండో అడిషనల్ సెషన్ జడ్జి సుదర్శన్ చేతుల మీదుగా పూర్ణకృష్ణకు అవార్డు ప్రదానం చేశారు. కొండాపూర్ మండలం సైదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో భాషోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న పూర్ణకృష్ణ కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక ఫోకస్ కేంద్రంలో పదో తరగతి విద్యార్థులకు మార్గదర్శనం చేస్తున్నారు. అవార్డు స్వీకరించడంపై ఉపాధ్యాయులు విజయ్‌కుమార్, గుండప్ప, భాను, సిద్ధారెడ్డి, రామకృష్ణ, శ్రీకాంత్, సాహితీవేత్తలు గంగాకాశీనాథ్, పెంటారెడ్డి అభినందించారు. కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి నసీమాబేగం, ఆంధ్ర సాంస్కృత పరిషత్ విశ్రాంత తెలుగు విభాగం అధిపతి యెహోన్, కవి రచయిత తిరునగరి శ్రీనివాస్ పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...