రజాకార్లను తరిమికొట్టింది కమ్యూనిస్టులే..


Sun,September 15, 2019 10:31 PM

సంగారెడ్డి అర్బన్, నమస్తేతెలంగాణ : తెలంగాణలో నాటి నైజాం పాలన కాలంలో దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడుతున్న కాసీంరిజ్వి రజాకర్లను తరిమికొట్టింది కమ్యూనిస్టు సాయుధ పోరాట నాయకులేనని కామ్రేడ్ ఎంకే మొయినోద్దీన్ అన్నారు. ఆదివారం ప్రభుత్వ అతిథి గృహంలో తెలంగాణ సాయుధ పోరాటాల వారోత్సవాల సందర్భంగా సీపీఐ జిల్లా సమితి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైజాం పాలనలో రాష్ట్రంలో పటేల్, పట్వారి, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా బందూక్ పట్టి నైజాం సైన్యంతో భీకర పోరాటం చేసింది తెలంగాణ సాయుధ పోరాట నాయకులేనని గుర్తు చేశారు. సీపీఐ రాష్ట్ర నాయకుడు ప్రకాశ్‌రావు మాట్లాడుతూ గత చరిత్ర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ఈతరం వాళ్లకు తెలియజేయడం కోసం ఈ నెల 11 నుంచి 17వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను జరుపుతున్నామన్నారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు సయ్యద్‌జలాల్, వజీర్‌బేగ్, తాజోద్దీన్, రహమాన్, లక్ష్మణ్, కృష్ణ, సునీత, ఆశప్ప, అజాద్, ఖాజా, శ్రీనివాస్, రుబీనాబేగం, కిరణ్, నర్సింహులు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...