మొక్కజొన్నపై మిడతల దాడి


Sat,September 14, 2019 11:14 PM

-నిమిషాల్లో లక్షల సంఖ్యలో చేనుపై కీటకాలు
-కండ్ల మందే మాయమవుతున్న పచ్చదనం
-లబోదిబోమంటున్న రైతాంగం
-ఉమ్మడి జిల్లాలో మిడతల దాడి ఉధృతి
-కనిపించని కీటక నివారణ మార్గం
-తొగుటకు చేరుకుంటున్న శాస్త్రవేత్తలు

తొగుట : మొక్కజొన్న పంట అనగానే నీళ్లు, ఎరువులు వేస్తే సక్కగా పండే పంటగా పేరుండేది. ఎలాంటి రోగం, పురుగుల సమస్యల లేకుండా పంట పండేది. ఇదంతా గతం.. శాస్త్ర సాం కేతిక విజ్ఞానం పెరిగే.. కొద్దీ పంట చేన్లకు రోగాల బెడద కూడా అదేస్థాయిలో పెరుగుతుండటంతో శాస్త్రవేత్తలకు కూడా అంతు పట్టకుండా పోతుంది. ఇప్పటికే కత్తెర పురుగు మొక్కజొన్న పంటను పీల్చి పిప్పి చేస్తుండటంతో శాస్త్రవేత్తలు శ్రమించి నివారణ సూచించారు. నేడు కత్తెర బెడద నుంచి రసాయనాల పిచికారితో రైతులు బయటపడుతున్నారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు... కరువు, కాటకాలతో సహవాసం చేస్తూ కష్టాల్లో.. వ్యవసాయ సాగు చేస్తున్న మొక్కజొన్న రైతులకు నేడు మిడతల పోటు శాపంగా మారింది. తొగుట మండలంలోని గోవర్ధనగిరి, గుడికందుల, వర్ధరాజ్‌పల్లి, ఘనపూర్ రైతులకు మిడతల పురుగులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక్క గోవర్ధనగిరి గ్రామంలోనే 300 ఎకరాల మొక్కజొన్న పంటను పీల్చి పిప్పిచేశాయి. ఆరుగాలం శ్రమించిన మొక్కజొన్న పంటకు కాలం కలిసి రావడంతో చేతికి వస్తు న్న సమయంలో లక్షలాది మిడతలు దాడి చేసి ఆకులతో పా టు కాండం, కంకులను సైతం తింటూ చేనును నిర్జీవం చేస్తున్నాయి.

రాత్రి పచ్చగా ఉన్న చేను.. పొద్దునపొయే వరకలా మిడతల దాడితో నిర్జీవంగా మారడంతో రైతులు కన్నీరు ము న్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న వ్యవసాయాధికారులు, ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీతో పాటు తోర్నాల, కరీంనగర్‌లోని మొక్కజొన్న పంట పరిశోధన విద్యాలయం శాస్త్రవేత్తలు సైతం పంట నష్టపోయిన ప్రాంతాలను చూసి ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. లక్షల సంఖ్యల మిడతల దాడులతో పచ్చని పంట ఎండిన చేనుగా తలపించడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొగుట మండలంలో మొదలైన మిడతల దాడి.. జిల్లాతోపాటు మెదక్ జిల్లా లో కూడా మొదలు పెట్టాయి. మిరుదొడ్డి, అందె, అల్వాల, దౌల్తాబాద్ మండలాలు, సిద్దిపేట మండలం తడ్కపల్లి, బుస్సాపూర్, వెంకటాపూర్, ఎన్సాన్‌పల్లి గ్రామాలు, మెదక్ జిల్లా చిన్నశంకరంపేట, నార్సింగి, రామాయంపేటలో మొక్కజొన్న పంటను నష్టం చేస్తున్నాయి. జిల్లాలో ఖరీఫ్‌లో 1.40 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశారు. మిడతల మూలం గా మొక్కజొన్నకు తీరని నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

ఆఫ్రికా దేశాల్లో మిడతల ఉధృతి ఎక్కువ...
మిడతల ప్రభావం పశ్చిమ, భూమధ్య రేఖపై ఉన్న ఆఫ్రికా దేశాల్లో అధికంగా ఉంటుంది. అక్కడ ఆకులను, ఆకుపచ్చ కాండాలను తింటూ అధిక నష్టం కల్గిస్తాయి. మన దేశంలోని రాజస్థాన్‌లో మిడతలు పంటలను నాశనం చేస్తుండటం సర్వసాధారణం. మిడతలు పొలాల్లో, గ్రామాల్లో విరివిగా కనిపించే కీటకం. పొలం గట్లు, బీడు భూముల్లో నివసిస్తూ సమీపంలో ఉన్న పంట చేన్లపై దాడి చేస్తుంటాయి. తడి వాతావరణంలో కన్నా, పొడి వాతావరణంలో వీటి ఉధృతి అధికంగా ఉంటుం ది. మిడతలు పొలాల మీద పడి ఆకులను క్షణాల్లో తినేస్తాయి. అవి ప్రయాణించిన ప్రాంతాల్లో పచ్చదనం మాయమై కరువు ఛ్చాయలు కనిపిస్తాయి. మిడతలు మొక్కజొన్నతో పాటు వరి, చెరుకు వంటి పంటలకు సోకే అవకాశం కూడా ఉంది.

పొలం గట్లపై ఉండే మిడతల నివారణకు గట్లపై ఉన్న గడ్డి తొలగించ డం ద్వారా, పొలాల్లో విద్యుత్ బల్బులు ఏర్పాటు చేస్తే నశించే అవకాశం ఉంది. రాత్రి వేళల్లో పొలాల్లో మంటలు వేయడం ద్వారా మిడతల్లో అధిక శాతం నిర్మూలించే అవకాశం ఉంది. అచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డా.డి.రాజిరెడ్డి, కీటక విభాగ యూనివర్సిటీ హెడ్ డా.ఎస్.రహమాన్ తదితరులు గోవర్ధనగిరి గ్రామంలో పర్యటించారు. మొక్కజొన్న పంటపై మిడతల ఉధృతిపై ఆందోళన వ్యక్తం చేశారు. వీటి నివారణకు ముందస్తుగా 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్ లీటరు నీటిలో, అలాగే, 2 మి.లీ మలాథియాన్, 2 మి.లీ లాండా సైహలోత్రిన్‌ను లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసి, మిడత దాడిని నుంచి పంటను రక్షించవచ్చని తెలిపారు.

అటవీ సంపద క్షీణించడంతోనే...
చెట్లను ఇష్టారీతిగా నరికి వేయడంతో అటవీ సంపద ధ్వం సమై.. పక్షుల సంపద క్షీణించిపోయింది. దీంతో కీటకాలు సంఖ్య పెరుగుతుంది. పక్షులు పెద్దసంఖ్యలో ఉంటే కీటకాలను ఆహారంగా స్వీకరించేవి. అడవులు లేకపోవడంతో కీటకాలతో పాటు అడవి పందులు, కోతులు పొలాలపై పడి దాడులు చేస్తున్నాయి. వీటి మూలంగా రైతులకు పెద్దఎత్తున నష్టం జరుగు తుంది. అటవీ సంపదను పెంపొందించడంతోపాటు వ్యవసా య క్షేత్రాల్లో చెట్లను పెంచితేనే కీటకాలు, అటవీ జంతువుల నుంచి పంటలను కాపాడవచ్చు. లేకుంటే మనుషులు సృష్టించిన వృక్ష మేధంతో.. హరితహాహాకారాలు తప్పవు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...