డబ్బు.. సమయం ఆదా


Sat,September 14, 2019 11:10 PM

సిద్దిపేట టౌన్ : లోక్ అదాలత్‌లతో డబ్బు, సమయం ఆదా చేసుకోవచ్చని జిల్లా 6వ అదనపు న్యాయమూర్తి భవానీప్రసాద్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ చేపట్టారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల కేసులు -9, సివిల్ కేసులు -4, క్రిమినల్ కేసులు -122, ఎక్సైజ్ కేసులు -17, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు -70 మొత్తం 222 కేసులను లోక్ అదాలత్‌లో రాజీ కుదిర్చి పరిష్కరించారు. రోడ్డు ప్రమాదాల బాధితులకు రూ.12.94 లక్షల పరిహారాన్ని అందజేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో రూ.లక్షా 40వేల జరిమానా విధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజీయే రాజమార్గమని, ఏండ్లుగా కొనసాగుతున్న కేసులను సత్వర పరిష్కారానికి జాతీయ అదాలత్ పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు సునీత, కిరణ్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్, ఏజీపీ మణి, న్యాయవాదులు రామారావు, హరిశ్చంద్ర, ప్రవీణ్‌రెడ్డి, శివచరణ్, జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సీఐలు, ఎస్‌ఐలు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...