లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం


Sat,September 14, 2019 11:10 PM

కంది : జిల్లా న్యాయస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తు న్న మెగా లోక్ అదాలత్ ద్వారా కేసులను స్వతరమే పరిష్కరిస్తున్నట్లు జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి పాపిరెడ్డి తెలిపారు. శనివారం స్థానిక జిల్లా కోర్టులో ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన లోక్‌అదాలత్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయముర్తి పాపిరెడ్డి మాట్లాడుతూ.. గతం లో జిల్లా న్యాయశాఖ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన మెగా లోక్ అదాలత్ ద్వారా ఎన్నో ఎండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను అక్కడిక్కడే పరిష్కరించా మని తెలిపారు. అందుకు సం బంధించిన సొమ్మును కూడా రికవరీ చేసి బాధితులకు అంద జేశాన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. కేసులను త్వరగా పరిష్కరించుకోవాలంటే రాజీమార్గంతోనే సాధ్యపడుతుందన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని ఆయన హితవుపలికారు.

పరిష్కరించిన కేసుల వివరాలు..
లోక్ అదాలత్‌లో మొత్తం 1705 కేసులను పరిష్కరించగా, వీటి ద్వారా రూ.52,21,543లను రికవరీ చేసి కక్షిదారులకు అందజేశారు. ఎంవీవోపీ కేసులు 12, సివిల్ కేసులు 13, క్రిమినల్ కంపౌండర్ కేసులు 425, ఫ్యామిలీ తగాదాల కేసులు 5. వీటికి సంబంధించి రూ.18,24,000 నష్టపరిహారంగా రీకవరీ చేశారు. అలాగే, బ్యాంక్ రీకవరి కేసులు 30 పరిష్కరించగా రూ.29,97,541లను రీకవరీ చేశారు. వీటితోపాటు విద్యుత్ చౌర్యం కేసులు 1215, ప్రిలిటగేషన్ కేసులు 2, చెక్‌బౌన్స్ కేసులు 3 పరిష్కరించి, రూ.4 లక్షలను రీకవరి చేసి కక్షిదారులకు అందజేశారు. లోక్‌అదాలత్‌లో న్యాయమూర్తులు కర్ణకుమార్, ఎం.శ్యాంశ్రీ, నీరజ, కల్పన, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, జనరల్ సెక్రెటరీ ప్రభుదాన్య, పోలీసు అధికారులు, బ్యాంక్ రీకవరి అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...