మహాత్ముడి ముఖ్య ఘట్టాల ప్రదర్శన


Fri,September 13, 2019 11:36 PM

గజ్వేల్ టౌన్: మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా శుక్ర, శని వారాల్లో ప్రజ్ఞాపూర్ సె యింట్ మేరిస్ పాఠశాలలో గాంధీజీ జీవిత ము ఖ్య ఘట్టాల ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. శుక్రవారం పాఠశాల ఆవరణలో విద్యార్థులు భారతదేశం చిత్రపటం ఆకారంలో కుర్చోని అందులో గాంధీజీ వేషధారణలో ఉన్న 150 విద్యార్థులు కూర్చున్నారు. అక్కనే చారాక, రాత్నం ఆకారంలో కూర్చొని ప్రదర్శన ఇచ్చారు. రెండు రోజుల పాటు జరుగుతున్న గాంధీజీ జీవితచరిత్ర ఘట్టాల ప్రదర్శనను గజ్వేల్ మున్సిఫ్ కోర్టు జడ్జి రవీందర్‌సత్తు ప్రారంభించారు. గాంధీజీ జీవితచరిత్రకు సంబంధించిన వివిధ ఘట్టాలను ప్రదర్శించిన విద్యార్థులను జడ్జి ప్రశంసించారు. నెల రోజుల పాటు ఆయన జీవితచరిత్రను తెలుసుకునేలా పాఠశాల యాజమాన్యం చేసిన కృషిని అభినందించారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించి, బహుమతుల ప్రదానం చేశారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శనను తిలకించారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...