స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుదాం


Fri,September 13, 2019 11:36 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ/సిద్దిపేట అర్బన్ : సీఎం కేసీఆర్ చేపట్టిన 30రోజుల ప్రణాళికలో పల్లెలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్ది, ఆదర్శం గా నిలుద్దామని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి, రూరల్ మండలం చిన్నగుండవెల్లి గ్రా మాల్లో జరిగిన గ్రామసభల్లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మతో కలిసి మంత్రి పాల్గొన్నారు. గ్రామాల్లో కలియ తిరిగారు. శ్రమదానం చేశారు. స్వయంగా జేసీబీ నడిపి, ట్రాక్టర్‌లో మట్టి నింపారు. పాడుబడ్డ ఇం డ్లను పరిశీలించి చెత్తను తరలించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పా టు చేసిన గ్రామ సభను ఉద్దేశించి మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ మన గ్రామంలోని ఇండ్లలోని చెత్త ఎంత ఉందో మనకే తెలియని పరిస్థితి ఉందన్నారు. మన ఇంట్లో చెత్తను జమ చేసుకున్నామంటే రోగాలను మనమే కొని తెచ్చుకుంటున్నామన్నారు. గ్రామం ఎంత శుభ్రంగా ఉం దో ఇల్లు, పరిసరాలు అలా శుభ్రంగా ఉండాలన్నారు. పరిశుభ్ర గ్రామంగా తీర్చిదిద్దితే రోగాలు రావన్నారు. ఇందుకు నిదర్శనం ఇబ్రహీంపూర్ అని అన్నారు. ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరు వారంలో ఒక రోజు శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు. తడి పొడి చెత్తలను వేర్వేరుగా చేసి ఇవ్వాలని, త్వరలోనే ప్రతి ఇంటికి రెండు చెత్తబుట్టలను అందిస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కోతుల బెడద తగ్గించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదన్నారు.

మహిళలు స్వయం ఉపాధి పొందాలి
చిన్నగుండవెల్లి గ్రామ మహిళలు స్వయంగా ఉపాధి పొందాలని మంత్రి హరీశ్‌రావు అన్నా రు. నిర్ణయం మీది.. అమలు చేయించే బాధ్య త నాది.. ఈ విషయమై మీరంతా నిర్ణయం తీసుకోవాలి.. అని మహిళలకు సూచించారు. గ్రామంలోని విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మా ట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయని, చిన్నగుండవెల్లి ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకోవాలన్నా రు. ఇంట్లోని పనికి రానటువంటి చెత్తను తీసివేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామన్నారు. జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబులు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమం లో డీఆర్‌డీఏ పీడీ గోపాల్‌రావు, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ శ్రీహరిగౌడ్, ఎంపీపీలు సవిత ప్రవీణ్‌రెడ్డి, శ్రీదేవి చందర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీలు అల్లం ఎల్లం, యాదగిరి, సర్పంచులు మంగ భాస్కర్‌గౌడ్, రఘోత్తంరెడ్డి ఎంపీటీసీలు శ్రీనివాస్, మెరుపుల సరస్వతీ, కో ఆప్షన్ సభ్యుడు శంకర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ పటేల్‌రెడ్డి, నాయకులు ఎర్ర యాదయ్య, గ్యార యాదగిరి, ఉప సర్పంచు రవికుమార్ పాల్గొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...