విద్యార్థులు ఆటపోటీల్లో రాణించాలి


Fri,September 13, 2019 11:35 PM

సిద్దిపేట రూరల్ : క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి తోడ్పడుతాయని జడ్పీటీసీ కోటగిరి శ్రీహరిగౌడ్, ఎంపీపీ శ్రీదేవీచందర్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని రాఘవాపూర్ హైస్కూల్‌లో ఎంఈవో గోపాల్‌రెడ్డితో కలిసి క్రీడలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ సెక్రటరీ వెంకటస్వామి, హెచ్‌ఎం శ్రీనివాస్, రాజప్రభాకర్‌రెడ్డి, పీఈటీలు లక్ష్మణ్, కనకరాజు పాల్గొన్నారు.

ముగిసిన మండలస్థాయి క్రీడలు
చిన్నకోడూరు : మండలస్థాయి క్రీడాపోటీలు చిన్నకోడూరులో శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు ఎంఈవో గోపాల్‌రెడ్డి, ఎస్‌ఐ అవినాశ్ బహుమతులు అం దజేశారు. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉమేశ్‌చంద్ర, హెచ్‌ఎం వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
నంగునూరు : మండలంలోని మగ్దుంపూర్ ఉన్నత పాఠశాలలో ఎస్‌జీఎఫ్ క్రీడల్లో చివరి రోజు నిర్వహించిన కబడ్డీ పోటీలను ఎంఈవో దేశిరెడ్డి ప్రారంభించారు. ఆటల్లో గెలు పు ఓటములను సహజంగా తీసుకొని క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు. విద్యార్థులకు చదువు, క్రీడలు రెండూ అవసరమన్నారు. క్రీడాకారులకు భోజన సదుపాయం కల్పించిన పద్మారెడ్డి, అలీని ఎంఈవో అభినందించారు. అండర్ -14 (బాలికలు)లో అక్కెనపల్లి ఆదర్శ పాఠశాల ప్రథమ, మగ్దుంపూర్ ఉన్నత పాఠశాల ద్వితీయ. అండర్ -17 (బాలికలు)లో అక్కెనపల్లి ఆదర్శ పాఠశాల ప్రథమ, రాజగోపాల్‌పేట ఉన్నత పాఠశాల ద్వితీయ స్థానంలో నిలిచింది. ఎంఈవో దేశిరెడ్డి విజేతలకు సొంత ఖర్చులతో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మయోజు పద్మ, ఎంపీటీసీ నితిన్, హెచ్‌ఎం నాగేందర్‌రెడ్డి ఉన్నారు.

కొనసాగుతున్న మండలస్థాయి క్రీడలు
సిద్దిపేట అర్బన్ : 65వ ఎస్‌జీఎఫ్ క్రీడాపోటీలు సిద్దిపేట డిగ్రీ కళాశాలలో ఖోఖో పోటీలు నిర్వహించారు. అండర్-17(బాలికలు)లో సిద్దిపేట ప్రభుత్వ బాలికల పాఠశాల, బక్రిచెప్యాల పాఠశాల. బాలురలో తడ్కపల్లి ఆవాస విద్యాలయం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అండర్-14లో(బాలికలు) సిద్దిపేట ప్రభుత్వ బాలికల పాఠశాల, సిద్దిపేట శారదానికేతన్ పాఠశాల. బాలురులో తడ్కపల్లి ఆవాస విద్యాలయం, సిద్దిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెలిచాయి. కార్యక్రమంలో ఎంఈవో యాదవరెడ్డి, ఎస్‌జిఎఫ్ సెక్రటరీ గ్యాదరి భిక్షపతి, పీఈటీలు సువర్ణలత, శ్రీనివాస్, హరికిషన్, బాబు, రాజ్‌మోహన్,సంతోసి, రజిత పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...