పరిశుభ్రతతోనే ఆరోగ్యం పదిలం


Fri,September 13, 2019 11:35 PM

నారాయణరావుపేట : మండల కేంద్రం నారాయణరావు పేటతోపాటు మండలంలోని గుర్రాలగొంది, జక్కాపూర్, లక్ష్మీదేవిపల్లి, గోపులాపూర్ గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక అమలు కార్యక్రమం కొనసాగుతుంది. శుక్రవారం ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని పాత ఇండ్ల గోడలను గుర్తించి తొలగించారు. అదే విధంగా వీధుల్లో ఉన్న ముళ్లపొదలు, గడ్డిని తొలగించి శుభ్రం చేశారు. పరిశుభ్రత పాటించాలని పిలుపునిచ్చారు.
సిద్దిపేట అర్బన్ : ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటిం చాలని సర్పంచ్ లతామాధవి పేర్కొన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా బొగ్గులోనిబండలో సర్పంచ్, గ్రామకార్యదర్శి సుస్మిత, స్పెషల్ ఆఫీసర్, ఏఈవో రాజశేఖర్ నేతృత్వంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. స్వయంగా సర్పంచ్‌తోపాటు అధికారులు తట్టపార చేత పట్టి పరిసరాల పరిశుభ్రత చేపట్టారు. ఆరోగ్యం, పరిశుభ్రత, మరుగుదొడ ్లవినియోగం, ఇంకుడు గుంతల ప్రాధాన్యతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

గ్రామాలను స్వచ్ఛతగా మార్చాలి..
నంగునూరు : మండలంలోని అన్ని గ్రా మాలను స్వచ్ఛతగా మార్చాలని జడ్పీటీసీ ఉమావెంకట్‌రెడ్డి అన్నారు. మండలంలోని ముండ్రాయి, పాలమాకులలో జడ్పీటీసీ పర్యటించారు. ఇంటి పరిసరాల్లో చెత్తాచెతారంతోపాటు నీరు నిల్వ ఉండ కుండా చూసుకోవాలన్నారు. పాత ఇండ్లను కూల్చివేస్తూ పాత సామన్లు, చెత్తాచెదారాన్ని తొలగించారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఎడ్ల సోంరెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, ఎంపీటీసీలు ఏటి తులసి, పరమేశ్వర్, సుమలత, సర్పంచ్‌లు కుమారస్వామి, కమలాకర్‌రెడ్డి, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు. అదే విధంగా జేపీతండాలో నిర్వహించిన పౌష్టికాహార వారోత్సవాల్లో జడ్పీటీసీ ఉమావెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. అంగన్‌వాడీ కేం ద్రం ఆవరణలో మొక్క నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ భిక్షపతినాయక్, ఎంపీటీసీ జోస్న నర్సింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ భారతి, అంగన్‌వాడీ టీచరు పాల్గొన్నారు.

పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దాలి..
చిన్నకోడూరు : పారిశుద్ధ్యం.. హరితహారం.. ఇంటింటికీ ఇం కుడు గుంతలు తప్పనిసరిగా ఉండాలని ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి అన్నారు. కస్తూరిపల్లిలో సర్పంచ్ పద్మగోవిందగిరిస్వామి అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాణిక్యరెడ్డి మాట్లాడుతూ ఇంటి పరిసరాతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామ సుం దరీకరణలో భాగంగా పాత ఇండ్లు, బావులు, ప్రహారీల కూల్చివేతకు గ్రామస్తులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, గ్రామాధికారి రాజవీరేందర్, ఫీల్డ్‌అసిస్టెంట్ మల్లేశం, ఉప సర్పంచ్ స్వామి, నాయకుడు నర్సారెడ్డి, గ్రామ కార్యదర్శి పర్శరాములు ఉన్నారు. అలాగే, మాచాపూర్, పెద్దకోడూరులో సర్పంచ్‌లు బాబు, లింగం ఆధ్వర్యంలో స్వచ్ఛగ్రామంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఎక్కువ రోజుల నిల్వ ఉన్న నీటిని పారబోయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ జమున ఎల్లయ్య, స్పెషల్ ఆఫీసర్ మహిపాల్, ఈవోపీఆర్డీ సుదర్శన్, వార్డు మెంబర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...