ప్రగతి పండుగ..


Fri,September 13, 2019 03:27 AM

- పల్లెల్లో జోరుగా 30 రోజుల కార్యక్రమం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఏడో రోజూ గురువారం జిల్లావ్యాప్తంగా గ్రామసభలు, సమావేశాలు పండుగ వాతావరణంలో జరిగాయి. ఊరూరా స్టాండింగ్ కమిటీలు, కో-ఆప్షన్ సభ్యు లు, సర్పంచ్‌ల ఆధ్వర్యంలో మండల, జిల్లాస్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటిం చి, సమస్యలను గుర్తించారు. స్వగ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, స్థానికులు విరాళాలు ఇవ్వడా నికి ముందుకు వస్తున్నారు. సర్పంచ్‌లు గ్రామా ల్లో 30 రో జుల ప్రణాళిక వేగవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు.

పరిసరాల పరిశుభ్రత పాటిం చాలని ప్రజలకు వివరిస్తున్నారు. పాత ఇండ్లు, కూలిన గోడలను జేసీబీ యంత్రాలతో కూల్చి వేస్తున్నారు. అలాగే, విష జ్వరాలు ప్రబలుతున్న తరుణంలో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధా న్యత ఇస్తున్నారు. మురుగు నీటికాలువల్లో పూడిక తీయిస్తూ.. శుభ్రం చేయిస్తున్నారు. అలా గే, ఇండ్లలో ఉన్న నీటి నిల్వలను తొలిగిస్తున్నా రు. రోడ్లు, వీధుల్లో ఉన్న చెత్తాచెదారాన్ని తీసేస్తు న్నారు. దీంతో గ్రామస్తులు శ్రమదానం చేపట్టి, గుంతలు పడిన రోడ్లు, రహదారులను మట్టితో నింపి పూడ్చుతున్నారు. కొన్ని గ్రామాల్లో హరిత హారం చేపట్టి, మొక్కలు నాటుతున్నారు. రహ దారుల వెంబడి ఉన్న పిచ్చిమొక్కలను నరికి వేస్తు న్నారు. అలాగే, నీటి వనరుల పరిరక్షణతోపాటు రక్షిత తాగునీటిపై అవగాహన కల్పించారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...