మత్స్య సంపద అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం


Fri,September 13, 2019 03:26 AM

మిరుదొడ్డి : గ్రామీణ ప్రాంతాల్లో మత్స్య సంపదను పెంపొందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఉచితంగా చేప పిల్లలను సరఫరా చేస్తూ చెరువు, కుంటల్లో వేస్తున్నారని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. గురువారం భూంపల్లి పెద్ద చెరువులో రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మత్స్య శాఖ జిల్లా అధికారి వెంకటయ్యను మత్స్యకారులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. గ్రామంలో నూతనంగా నిర్మించే మార్కెట్ (అంగడి) షెడ్ల స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఎమెల్యే మాట్లాడుతూ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చే యాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పె ట్టి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళ్లేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాగానే కాలువల ద్వారా రాష్ట్రంలోని అన్ని పల్లెల్లోని చెరువు, కుంటలను నీటితో నింపుతామన్నారు. చాపల పెం పకంలో దేశంలోనే రాష్ట్రం మత్స్య పారిశ్రామికంగా వెలుగొందుతుందన్నారు.

అవ్వా పనులు బాగా చేస్తున్నారా..
భూంపల్లి, ఖాజీపూర్ గ్రామాల్లో రోడ్లకు ఇరు వైపులా పనులు చేస్తున్న ఈజీఎస్ ఉపాది హామీ పథకం కూలీలను కారు ఆపి ఎ మ్మెల్యే అప్యాయంగా అవ్వా.. బాగున్నారా అంటూ పలుకరించారు. అవ్వా మీకు ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకంలో కూలీ చేసిన డ బ్బులు సక్రమంగా అందుతున్నాయా? లేవా అంటూ? కూలీలను అడిగి తెలుసుకున్నారు. సారు మాకు డబ్బులు సక్రమంగా నే వస్తున్నాయని కూలీలు తెలిపారు. ఊరిలో జరిగే పనుల్లో పేద ప్రజలు కొందరూ మాత్రమే చేస్తున్నారు..మిగత వారు పనులు చేయడం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలు అన్ని పనుల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఈజీఎస్ సిబ్బందికి సూచించారు.

మృతుడి కుటుంబానికి పరామర్శ..
పది రోజుల క్రితం గ్రామంలో మృతి చెందిన తాళ్ల కిషన్ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి ఓదార్చారు. కార్యక్రమంలో ఎంపీపీ గజ్జె సాయిలు, జడ్పీటీసీ సూకురి లక్ష్మి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శ బక్కి వెంకటయ్య, సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ ఉమారాణి, జిల్లా గ్రంథాలయ బోర్డు డైరెక్టర్ బోయ శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యుడు ఎర్మని దుబ్బరాజం, టీఆర్‌ఎస్ నేతలు నరేశ్, సురేశ్ గౌడ్ పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...