రోటా వ్యాక్సినేషన్‌పై టాస్క్‌ఫోర్స్ సమావేశం


Wed,September 11, 2019 11:26 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : రోటా వైరస్ వల్ల చిన్న పిల్లల్లో కలిగే విరేచనాలు తగ్గించి శిశు మరణాలు నివారించేందుకు రోటా వైరస్‌కు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా టాస్క్‌పోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోటా వైరస్ వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఆర్‌వో మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి 21 వరకు మండల స్థాయి శిక్షణ పూర్తి చేయాలన్నారు. శిక్షణ అనంతరం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గల చిన్న పిల్లలకు 6 -14 వారాల పిల్లలకు అన్ని టీకాలతో పాటు రోటా వైరస్ వ్యాక్సిన్ అందించాలని సూచించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి విజయరాణి మాట్లాడుతూ వ్యాక్సిన్ వల్ల చిన్న పిల్లల్లో విరేచనాలు తగ్గించవచ్చన్నారు. ఈ సందర్భంగా డా.మురారి సర్వ్‌లైన్స్ మెడికల్ ఆఫీసర్ హైదరాబాద్ రోటా వైరస్ వ్యాక్సిన్ ఉపయోగాలు, వినియోగించే విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో వైద్యులు కాశీనాథ్, రజిని, మల్లీశ్వరి, బలరాం, పవన్, డా.వినోద్, నర్సింహ, పీటర్సన్, చక్రధర్, రాజేందర్, చంద్రశేఖర్, ఐసీడీఎస్, స్వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...