నేడు సిద్దిపేటలో నాటిక పోటీలు


Wed,September 11, 2019 11:26 PM

సిద్దిపేట టౌన్ : తెలంగాణ సంగీత నాటక అకాడమీ నాటక రంగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్రం సిద్ధించాక విద్యార్థుల కోసం మొట్టమొదటి సారిగా నాటిక పోటీలను నిర్వహిస్తుందని సంగీత నాటక అకాడమీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు లక్ష్మీకిరణ్, జిల్లా కమిటీ సభ్యుడు ఉండ్రాల రాజేశం చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ జిల్లా స్థాయి నాటిక పోటీలను గురువారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించనున్నామన్నారు. బాలల నాటకోత్సవాలు -2019ని ఎంబీహెచ్‌ఆర్ థియేటర్ అకాడమీ సిసా, రససిద్ధ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందన్నారు. పోటీలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, విద్యాధికారి రవికాంతారావు, ప్రెస్ అకాడమీ సభ్యుడు కొమురవెల్లి అంజయ్య హాజరవుతున్నారన్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రాథమిక పరిశీలనలో 20 నాటికలు ఎంపికయ్యాయని అందులో 6 నాటికలను బాలల నాటకోత్సవంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రదర్శిస్తారన్నారు. ప్రతిభ కనబర్చిన వారి నాటకాలను హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే రాష్ట్ర స్థాయి ప్రదర్శనలకు ఎంపికవుతాయన్నారు. సిద్దిపేటలో జరిగే ముగింపు నాటికల వేడుకలకు ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మున్సిపల్ చైర్మన్ రాజనర్సులు హాజరై బహుమతులు అందిస్తారన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...