అదృశ్యమైన విద్యార్థి మృతి


Wed,September 11, 2019 11:26 PM

మిరుదొడ్డి : గురుకుల పాఠశాల/కళాశాల విద్యార్థి అదృశ్యమై అల్వాల గ్రామంలోని జిగిరి కుంటలో శమమై తేలిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఎండీ.జమాలుద్ద్దీన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని గాడుదుల అరికేని గ్రామానికి చెందిన అరిగే వసంత, అశోక్ కుమార్ దంపతుల కుమారుడు అరిగే కరుణాకర్ (15) మిరుదొడ్డి మండల పరిధిలోని చెప్యాల-అల్వాల గ్రామాల శివారులోని గురుకుల పాఠశాల/కళాశాల 9వ తరగతి చదువుతున్నాడు. కర్ణాకర్ తల్లి దండ్రులు చిన్న తనంలోనే మృతి చెందడంతో చిన్నా న్న ప్రేమ్ కుమార్ 5వ తరగతిలో గురుకుల పాఠశాలలో చేర్పించాడు.

మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఉపాధ్యాయులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈత కొట్టడానికి అల్వాల గ్రామ శివారులోని జిగిరి కుంట వద్దకు కర్ణాకర్ వెళ్లాడు. తన బట్టలను విప్పి వేసి ఈత రాని కర్ణాకర్ కుంటలోకి దిగడంతోనే జేసీబీ గుంతలోకి జారీ పోయాడు. మంగళవారం రాత్రి విద్యార్థి అదృశ్యమైనట్లు వైస్ ప్రిన్సిపాల్ మశిరెడ్డి కృష్ణారెడ్డి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం ఉదయం కుంట వద్ద ఉన్న బట్టల ఆధారంగా కుంటలో గాలించడంతో మృతుడి ఆచూకీ లభించిందని వివరాలను వెల్లడించారు. శవాన్ని దుబ్బాక ఏరియా దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతుందన్నారు.

ఆందోళన చేసిన బంధువులు
మృతిడి బంధువులు పాఠశాల/కళాశాలకు చేరుకొని ఆందోళన చేశారు. అక్కడికి చేరుకున్న ఆర్‌సీవో నిర్మల తగు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ మేరకు బంధువులు ఆందోళన విరమించారు. సంఘటన వద్దకు ఎంపీపీ గజ్జెల సాయిలు చేరుకొని బంధువులను సముదాయించారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...