అమరుల త్యాగాలను మరువం


Wed,September 11, 2019 11:25 PM

సిద్దిపేట టౌన్ : విధి నిర్వహణలో అసువులు బాసిన అటవీ అధికారుల సేవలను మరువమని అటవీ శాఖ జిల్లా అధికారి శ్రీధర్‌రావు అన్నారు. అటవీ శాఖ అమరుల సంస్మరణ దినం జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అమరుల స్థూపానికి నివాళులు అర్పించారు. రెండు నిమిషాలు వారిని స్మరిస్తూ మౌనం పాటించారు. అనంతరం జిల్లా అధికారి శ్రీధర్‌రావు మాట్లాడుతూ అటవీ సంపదను నిరంతరం కాపాడేందుకు అధికారులు తమ ప్రాణాలను అడ్డుపెట్టి విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు.

స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లోనే అటవీ సంరక్షణ కోసం అధికారులు సేవలు అందించారన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అటవీ సంపదను కాపాడేందుకు వెళ్లి అసువులు బాసిన వీరులను స్మరిస్తూ ప్రతి ఏడాది సెప్టెంబర్ 11న అటవీ అమర వీరుల దినోత్సవాన్ని జరుపుతున్నామని అన్నారు. అటవీ అధికారుల సేవలను ఆయన కొనియాడారు. అంతకు ముందు అటవీ శాఖ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అమరవీరులను స్మరిస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, చందు, సందీప్‌కుమార్, అసీమ్, సిబ్బంది పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...