ఆర్‌అండ్‌ఆర్ కాలనీ.. దేశానికే ఆదర్శం


Wed,September 11, 2019 11:25 PM

ములుగు : కొండపోచమ్మ రిజర్వాయర్ భూనిర్వాసితుల కోసం నిర్మిస్తున్న ఆర్‌అండ్‌ఆర్ కాలనీలు దేశానికే ఆదర్శంగా నిలువనున్నాయని ఆర్డీవో విజయేందర్‌రెడ్డి అన్నారు. ములుగు మండలంలోని తునికిబొల్లారంలో నిర్మిస్తున్న ఆర్‌అండ్‌ఆర్ కాలనీ, లేఅవుట్ నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఏజెన్సీలను ఆదేశించారు. ఈ సందర్భం గా ఆర్డీవో మట్లాడుతూ.. ఇప్పటికే 600 ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని, త్వరలోనే భూనిర్వాసితులకు అందజేస్తామన్నారు. సకల హంగులతో ఆర్‌అండ్‌ఆర్ కాలనీ నిర్మాణ పనులను చేపట్టినట్లు ఆయన తెలిపారు. భూనిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని ప్రాజెక్టుల నిర్మా ణానికి భూములను త్యాగం చేసిన నిర్వాసితులకు ప్రభు త్వం అండగా ఉంటుందన్నారు. కాలనీ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా శరవేగంగా పూర్తి చేయాలని ఏజెన్సీలకు సూచించారు. నిర్వాసితులకు ప్లాట్లు అందజేసేందుకు అదనంగా 4 ఎకరాల భూమి తీసుకున్నట్లు ఆర్డీవో తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీపీ లావణ్యఅంజన్‌గౌడ్, వైస్ ఎంపీపీ వీరన్నగారి దేవేందర్‌రెడ్డి, సర్పంచ్ పావని జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...