ప్రజాకవికి ఘననివాళి


Tue,September 10, 2019 04:35 AM

-ఘనంగా కాళోజీ నారాయణరావు జయంతి
-నివాళులర్పించిన నేతలు, అధికారులు
కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : పుట్టుక నీది..చావు నీది..బతుకంత దేశానిది అని వెలుగెత్తి చాటిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో కాలోజీ 105వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి పూల మాలవేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ కాళోజీ కన్న కలలను తెలంగాణను సాధించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. నిజాంకు, సమైక్య వాదులకు వ్యతిరేకంగా తన కవితలతో ప్రజలను చైతన్యవంతం చేసిన గొప్పకవి అన్నారు. కాళోజీ ఆశయ సాధన కోసం అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కార్యాలయంలో..
సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతి, తెలంగా భాషా దినోత్సవాన్ని కాళోజీ జయంతి వేడుకులను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీవిత కాలం తెలంగాణ కోసం పరితపించిన మహనీయుడు కాళోజీ అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...