13న జిల్లా స్థాయి స్వచ్ఛ పక్షోత్సవాలు


Tue,September 10, 2019 04:32 AM

సిద్దిపేట ఎడ్యుకేషన్ : అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛ పక్షోత్సవాలు నిర్వహించాలని మండల విద్యాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాధికారి రవికాంతారావు ఆదేశాలిచ్చారు. అలాగే ఈ నెల 13న జరిగే జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు ఒక్కో అంశానికి ఇద్దరు విద్యార్థుల చొప్పున పంపించాలన్నారు. సిద్దిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోటీలు జరుగుతాయని తెలిపారు. ఇందులో లేఖ, వ్యాస రచన, పెయింటింగ్, టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పాల్గొనే విద్యార్థుల వివరాలు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి మెయిల్ చేయాలని మండల విద్యాధికారులకు సూచించారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...