మొక్కులు తీర్చుకున్న టీఆర్‌ఎస్ నాయకులు


Tue,September 10, 2019 04:31 AM

దుబ్బాక టౌన్ : సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు మంత్రి పదవి రావడంతో దుబ్బాక మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లిలో టీఆర్‌ఎస్ నాయకులు మొక్కులు తీర్చుకున్నారు. స్థానిక శివాలయంలో సోమవారం 1116 కొబ్బరికాయలు కొట్టి సంబురాలు జరుపుకున్నారు. మాజీ సర్పంచ్, టీఆర్‌ఎస్ నాయకుడు ఇల్లందుల శ్రీనివాస్ మాట్లాడుతూ...హరీశ్‌రావుకు మంత్రి పదవి రావాలని తాము మొక్కుకున్నామని, ఆర్థిక మంత్రి పదవి రావడంతో గ్రామంలోని శివాలయంలో మొక్కలు తీర్చుకున్నామన్నారు. కార్యక్రమంలో అధికం వెంకటస్వామిగౌడ్, బిజ్జు లింగయ్య, రవి, యాదగిరి, సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు.

తిరుమలలో..
కలెక్టరేట్,నమస్తే తెలంగాణ : ఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జిల్లా టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు మేర్గు మహేశ్ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో సోమవారం 101 కొబ్బరి కాయలు కొట్టి మొక్కులను చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడంతో సంతోషం వ్యక్తం చేశారు.

మంత్రి హరీశ్‌రావును కలిసిన బక్కి వెంకటయ్య
మిరుదొడ్డి : రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావును సోమవారం రాత్రి హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బక్కి వెంకటయ్య వెంట టీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...