అలా మొదలై.. ఇలా ముగిసి..


Sat,September 7, 2019 11:41 PM

మిరుదొడ్డి/ తొగుట/ దౌల్తాబాద్ : ప్రజలందరూ గ్రామ పరిశుభ్రతకు తోడ్పాటును అందిస్తూ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి దోహద పడాలని సర్పంచ్ తుమ్మ బాల్‌రాజు, ఎంపీటీసీ కీసరి రాజవ్వ ప్రజలను కోరారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఆయా శాఖలు అధికారులు వివిధ రకాల పనులను చేశారు. ఈ సందర్భంగా కాసులాబాద్‌లో పిచ్చి మొక్కలను తొలగించి వివిధ రకాల మొక్కలను నాటారు. అనంతరం సర్పంచ్, ఎంపీటీసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ప్రకారం గ్రామంలో అన్ని పనులను పూర్తి చేస్తామని తెలిపారు.

స్వచ్ఛ గ్రామాలుగా..
గ్రామ పంచాయతీల సంపూర్ణ అభివృద్ధి కోసం 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం రెండో రోజైన శనివారం మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రత్యేకాధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పాలకవర్గం, కమిటీ సభ్యులతో కలిసి వాడ వాడలా తిరిగి సమస్యలను తెలుసుకున్నారు. పాడుపడిన ఇండ్లు, బావులు, స్థలాలను గుర్తించి వినియోగం లేని వాటిని తొలగించాలన్నారు. తడి, పొడి చెత్త నిర్వహణ కోసం ఇంటింటికి రెండు బుట్టలను పంపిణీ చేస్తామన్నారు. తొగుటలో ప్రత్యేకాధికారి, ఎంపీడీవో రాజిరెడ్డి గ్రామ సర్పంచ్ పాగాల కొండల్‌రెడ్డితో కలిసి గ్రామంలో పర్యటించారు. ఎల్లారెడ్డిపేటలో సర్పంచ్ సిరినేని గోవర్దన్, లింగంపేటలో మంగ రేణుక ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించారు.

శుభ్రతతో వ్యాధులకు చెక్..
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తమ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో ఎలాంటి వ్యాధులు దరిచేరవని ప్రత్యేక అధికారి గోవిందరాజులు అన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా శనివారం దొమ్మాటలో ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి ప్రజలు పరిశుభ్రతను పాటించాలని ర్యాలీ నిర్వహించారు. అనంతర ప్రత్యేక అధికారి మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడా కూడా చెత్తా చెదారం లేకుండా చూడాలని పేర్కొన్నారు. చెత్త రహిత గ్రామంగా దొమ్మాటను తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీ, పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...