చిందు, యక్షగానం ఆల్బమ్ ఆవిష్కరణ


Sat,September 7, 2019 11:36 PM

సిద్దిపేట టౌన్ : సిద్దిపేట జిల్లాకు చెందిన జానపద చిందు, యక్షగాన కళాకారుడు పిన్నింటి ప్రకాశ్ రూపొందించిన ఆల్బమ్‌ను హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ శనివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని శాఖలతో చేపట్టిన ప్రదర్శన పోటీల పేపర్ కటింగ్స్‌ను.. చిందు, యక్షగాన పౌరాణిక పద్యనాటకాల, జానపద పల్లెపాటల ప్రదర్శనల క్లిప్పింగ్స్‌లను పోగు చేసి ఆల్బమ్‌ను రూపొందించామన్నారు. మన జానపద కళను భవిష్యత్ అందించేందుకు ఆల్బమ్‌ను తయారు చేశామని చెప్పారు. గవర్నర్ దత్తాత్రేయ చేతుల మీదుగా ఆల్బమ్‌ను ఆవిష్కరించడం గొప్ప అనుభూతి కలిగిందని పేర్కొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...