పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం


Sat,September 7, 2019 11:36 PM

హుస్నాబాద్ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వ్యాధులు రాకుండా అరికట్టవచ్చని జాతీయ కీటక జనిత వ్యాధుల నివారణ హుస్నాబాద్ సబ్ యూనిట్ అధికారి రామమూర్తి అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో డెంగీ, మలేరియా వ్యాధులపై మెప్మా సభ్యులకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో పాడుబడిన వస్తువులతోపాటు వాడేసిన కొబ్బరి బొండాలు, వాడని సంపులు పెరిగేందుకు దోహదపడుతాయన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మహిళలదే కీలక పాత్ర అని మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య పేర్కొన్నారు. మెప్మా ఏడీఎంసీ సంతోషి మాట్లాడుతూ డెంగీ, మలేరియా వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటితోపాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని పతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది కనకయ్య, ఎల్లగొండమ్మ, మెప్మా లక్ష్మి, పద్మ, పరమేశ్వరి

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...