ఎరువుల కొరత లేదు


Sat,September 7, 2019 11:35 PM

తూప్రాన్ రూరల్ : మున్సిపాలిటీతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి అన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలో అసంపూర్తిగా మిగిలిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. తూప్రాన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఆవరణలో శనివారం ఆర్డీవో శ్యాంప్రకాశ్, మున్సిపల్ కమిషనర్ ఖాజా మోజియోద్దీన్, దవాఖాన సూపరింటెండెంట్ అమర్‌సింగ్, పంచాయతీరాజ్ డీఈ నర్సింహులు, వ్యవసాయశాఖాధికారులతో కలిసి హరితహరం మొక్కలు నాటారు. అనంతరం ఆర్డీవో ఆఫీస్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా వ్యవసాయ అధికారులతో సమావేశమయ్యారు. తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో ఎరువుల కొరత లేదని, రైతాంగానికి కావాల్సిన ఎరువులు తెప్పించాలన్నారు. శనివారం సాయంత్రం వరకు రైతులకు సరిపడా మరో 20 మెట్రిక్ టన్నుల యూరియా అందుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు.

తూప్రాన్ మండలం వెంకటాయపల్లికి ఆర్టీసీ బస్సు సౌ కర్యం త్వరలోనే ఏర్పాటు చేస్తామని గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి చెప్పారు. 5 రోజుల క్రితం వెంకటాయపల్లిలో పర్యటించిన సందర్భంగా గ్రామస్తుల కోరిక మేరకు ఆర్టీసీ బస్సును నడుపుతామని హామీ ఇచ్చామని పేర్కొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...