యోగాతో ఆరోగ్య సమాజం


Sat,September 7, 2019 11:34 PM

సిద్దిపేట ఎడ్యుకేషన్ : విద్యార్థుల్లో ధారణ శక్తి, ఏకాగ్రత పెరుగటంతోపాటుగా ఆత్మవిశ్వాసం పెంపొందించాలనే సంకల్పంతో మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రభుత్వ పాఠశాలల్లో యోగా శిక్షణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఆరోగ్య సిద్దిపేటలో భాగంగా సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో రెండు విడుతలుగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు యోగా శిక్షణ తరగతులు ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా మొదటి విడుత శిక్షణ గత నెలలో ముగిసింది. రెండో విడుత యోగా శిక్షణ ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు సాగింది. రెండో విడుత శిక్షణలో సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్ మండలాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు శిక్షణ పొందారు. యోగా కో ఆర్డినేటర్, ప్రముఖ యోగా శిక్షకుడు తోట సతీశ్, సహా శిక్షకులు బొజ్జ ఆశోక్, గంగాపురం శ్రీనివాస్‌లు ఉపాధ్యా యులకు యోగా మెళుకువలను నేర్పించారు. శనివారం సిదిపేట టీటీసీ భవన్‌లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయులకు యోగా శిక్షణ ముగింపు సమావేశం ఏర్పాటు చేశారు.

సమావేశంలో జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్ మా ట్లాడుతూ...ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా అన్నారు. క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు తలపెట్టిన ఆరోగ్య సిద్దిపేట లక్ష్యాన్ని నేరవేర్చినవారం అవుతామని పేర్కొన్నారు. సెక్టోరియల్ అధికారి రమేశ్ మాట్లాడుతూ... యోగావల్ల శారీరక, మానసిక ఆందోళనలు, రుగ్మతలు తొలగిపోతాయన్నారు. మండల విద్యాధికారి యాదవరెడ్డి మాట్లాడుతూ.. ఐదు రోజుల పాటు నేర్చుకున్న యోగాను పాఠశాలలో విద్యార్థులకు నేర్పించడంతో పాటుగా యువజన సంఘాలు, ప్రజాప్రతినిధులు, సమైఖ్య సంఘాలకు యోగా ప్రాముఖ్యతను తెలియజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...