మొక్కలు నాటి, సంరక్షించాలి


Fri,September 6, 2019 11:25 PM

సిద్దిపేట టౌన్ : హరితహారంలో ప్రజ లందరూ భాగస్వాములు కావాలని 6వ వార్డు కౌన్సిలర్ సాకి బాల్‌లక్ష్మీఆనంద్ పి లుపునిచ్చారు. అందు లో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి మొక్క ఎదిగేలా సంరక్షణ బాధ్యతలు కుటుంబ సభ్యులు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో హరితహారం అధికారి ఐలయ్య, ఆర్‌పీ యాదమ్మ, సాకి గాంధీ, దుర్గాప్రసాద్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

బ్రాహ్మణ యువసేన ఆధ్వర్యంలో..
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని బ్రాహ్మణ యువసేన తాలూకా అధ్యక్షుడు వేలేటి ఫణీంద్రశర్మ పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. మొక్కలు నాటితే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి లభిస్తుందన్నారు. కాలుష్య ని వారణకు మొక్కలు నాటడమే మార్గమన్నారు. కార్యక్రమం లో బ్రాహ్మణ యువసేన నేత లు రాజేంద్రశర్మ, రాజశేఖర్‌శర్మ, శ్రీచరణ్‌శర్మ, భరద్వాజ్, సోమసుందర్ పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...