స్వచ్ఛసర్వేక్షణ్ బృందం పర్యటన


Fri,September 6, 2019 11:24 PM

కోహెడ: మండలంలోని శ్రీరాములపల్లి, నారాయణపూర్ గ్రామాల్లో శుక్రవారం స్వచ్ఛ స్వర్వేక్షణ్ కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించారు. గ్రామాల్లో పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, ఇంకుడుగుంతల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు తప్పనిసరిగా మరుగుదొడ్లను వినియోగించుకోవాలని, ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలని గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తడ్కల రాజిరెడ్డి, సర్పంచ్‌లు ముంజ మంజుల, అన్నవేని కనకయ్య, ఎంపీటీసీ వేముల శ్రీనివాస్ , వార్డు సభ్యులు, స్ధానిక నాయకులు, కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...