సిద్దిపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుకుందాం..


Fri,September 6, 2019 11:24 PM

సిద్దిపేట టౌన్ : సిద్దిపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుదామని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం రాత్రి ఎన్జీవోస్ ఆధ్వర్యంలో సిద్దిపేట ఎన్‌జీవోస్ భవన్‌లో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న 16మంది, సిద్దిపేట వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ భవన్‌లో 27మందిని సన్మానించారు. ఆయా కార్యక్రమాలకు ఎమ్మెల్యే హరీశ్‌రావు హాజరై, మాట్లాడారు. ఎన్జీవోస్ సభ్యులు ఉత్తమ ఉపాధ్యాయులు, ఉద్యోగులను సన్మానించే సంస్కృతికి అంకురార్పణ చేయడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు మంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. ఆరోగ్య సిద్దిపేటకు వాసవీ క్లబ్ ముందుండాలన్నారు.

స్వచ్ఛ ఆరోగ్య సిద్దిపేటలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో ఐదుగురితో కూడిన ఆరోగ్య, స్వచ్ఛ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అందులో ఉద్యోగులు, ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, ఎన్‌జీవోస్ భవన్ అధ్యక్షుడు నాయకం మల్లయ్య, సత్యనారాయణ, ఉండ్రాల రాజేశం, ఉత్తమ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వాసవి క్లబ్ అధ్యక్షుడు పుల్లూరు శ్రీనివాస్, నాయకులు పాల సాయిరాం, సుశ్మ, గంప శ్రీనివాస్, కొర్తివాడ రాజేందర్, నవీన్‌కుమార్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...