తమహోన్నతమైన వ్యక్తి రాజేశ్వర్‌రావు


Fri,September 6, 2019 12:12 AM

-ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి..
-విద్యాసంస్థల స్థాపనతో ఎంతోమందికి ఉపాధి
-విగ్రహావిష్కరణలోట్రాన్స్‌కో,జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు

అక్కన్నపేట: ఆదర్శప్రాయుడు, స్ఫూర్తిదాత, గొప్పమనస్సు కలిగిన మహోన్నతమైన వ్యక్తి వొడితెల రాజేశ్వర్‌రావు అని రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు కొనియాడారు. గురువారం మండలంలోని అంతకపేటలో మాజీ ఎంపీ వొడితెల రాజేశ్వర్‌రావు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభాకర్‌రావు మాట్లాడారు. 50ఏండ్ల జీవిత ప్రస్థానంలో ఎన్నో చూసినప్పటికీ, నేడు వొడితెల రాజేశ్వర్‌రావు విగ్రహాన్ని తన తన చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాజేశ్వర్‌రావుకు తనకు వీడదీయరాని ఆత్మీయ అనుబంధం ఉండేదన్నా రు. సీఎం కేసీఆర్ ఇటీవల జయశంకర్ జయంతి సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్‌తోపాటు వొడితెల రాజేశ్వర్‌రావులను గుర్తు చేశారన్నారు. విద్యాసంస్థలను స్థాపించి ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించడంతో పాటు పేద విద్యార్థులకు అండగా నిలిచారన్నారు.

రాజేశ్వర్‌రావు వ్యక్తి కాదునని, ఓ వ్యవస్థ అని కొనియాడారు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాజేశ్వర్‌రావు విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టిన రామంచ సర్‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం హరితహారం కింద మొక్క నాటి నీళ్లు పోశారు. రాజేశ్వర్‌రావు విగ్రహాం వద్ద హైమాస్ట్ లైట్లు, గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు.వేదికపై రాజేశ్వర్‌రా వు రెండో కొడుకు శ్రీనివాస్‌రావు జన్మదిన వేడుక లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, కరీంనగర్ సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, గోపాల్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, వొడితెల కుటుంబ సభ్యులు కిషన్‌రావు, శ్రీనివాస్‌రావు, పవన్‌కుమార్, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కష్టాలు..రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు
తెలంగాణ రాక ముందు చీకట్లో ఉండే పరిస్థితి ఉండేదని, రాష్ట్రం వచ్చినంక కరెంట్ కష్టాలు పోయాయని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ట్రాన్స్‌కో, జెన్‌కోకు వేర్వేరు సీఎండీలు ఉండేవారని, సీఎం కేసీఆర్ ప్రభాకర్‌రావుకే రెండూ అప్పగించారన్నారు. దీంతో కరెంటు కోత లేకుండా పోయిందన్నారు. ఒకనాడు తమకు మాత్రమే తెలిసిన ప్రభాకర్‌రావు, కరెంట్ పుష్కలంగా ఇవ్వడంతో నేడు రాష్ట్రమంతా రైతులు, అధికారులకు తెలిసిపోయాడన్నారు. మా అన్న రాజేశ్వర్‌రావు మాకు ఆదర్శం.. ఆయన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చాం. మా అందరి రాజకీయం సింగాపూర్ నుంచే మొదలైంది. ముఖ్యంగా మా గ్రామానికి మా వొడితెల కుటుంబం రుణపడి ఉంటుంది.. టీఆర్‌ఎస్ ఆవిర్భావ సమయంలో పార్టీలో మనం పని చేయాలె.. పార్టీకి అన్ని విధాల సహకరించాలె.. లేకుంటే ఇంక ఆంధ్రోళ్లతో కలిసి ఉంటే సన్యాసులం అయితాం.. అని పార్టీలో క్రియాశీలకంగా పని చేసేలా రాజేశ్వర్‌రావు ప్రోత్సహించారన్నారు.

పెద్దనాన్న వల్లే రాజకీయాల్లోకి.. ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్
హైదరాబాద్‌లో ఉండే తనను పెద్దనాన్న వొడితెల రాజేశ్వర్‌రావు సింగాపూర్‌కు పిలిచి, రాజకీయాల్లోకి తీసుకొచ్చారని, నేడు ఆయన ఆదర్శంతోనే రెండు సార్లు హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని వొడితెల సతీశ్‌కుమార్ చెప్పారు. వొడితెల కుటుంబమంటే ప్రజల్లో ప్రేమానురాగాలు ఉన్నాయని, వాటిని కొనసాగిస్తామన్నారు. రాజేశ్వర్‌రావు విగ్రహావిష్కరణ చాలా సంతోషంగా ఉందని, అందులో పెద్దనాన్నకు ఇష్టమైన వ్యక్తి ప్రభాకర్‌రావు విగ్రహాని ఆవిష్కరించడం మరింత తృప్తినిచ్చిందన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...