బీజేపీ నేత మహిపాల్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు


Fri,September 6, 2019 12:07 AM

మిరుదొడ్డి : ఎంపీపీ గజ్జెల సాయిలు, జడ్పీటీసీ సూకురి లక్ష్మి భర్త సూకురి లింగం వ్యక్తులను కులం పేరుతో దూషించిన బీజేపీ నేత పబ్బతి మహిపాల్‌రెడ్డిపై పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఎండీ జమాలుద్దీన్ కథనం...రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల తీరును పరిశీలించడానికి ఎంపీపీ గజ్జెల సాయిలు, జడ్పీటీసీ భర్త సూకురి లింగం స్థానికులతో కలిసి లక్ష్మీనగర్ గ్రామ పం చాయతీ కార్యాలయానికి మధ్యాహ్నం సమయంలో వెళ్లారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? అని ఎంపీపీని, జడ్పీటీసీ భర్తను లక్ష్మీనగర్‌కు చెందిన పబ్బతి నాగలక్ష్మి, మల్లారెడ్డి రెండో కుమారుడు. బీజేపీ నేత పబ్బతి మహిపాల్‌రెడ్డి అడ్డుకు న్నా రు. ఎంపీపీ అధికారిక కార్యక్రమాలను చేయనియ్యకుండా అడ్డుకున్నాడు.

అధికారిక కార్యక్రమాలను అడ్డుకోవద్దని మహిపాల్‌రెడ్డికి ఎంపీపీ సాయిలు నచ్చజెప్పినా వినకుండా ఇష్టారీతిగా దుర్బషలాడుతూ కులం పేరుతో తిట్టాడు. దీంతో పాటు ఇక్కడి నుంచి మీరందరూ వెళ్లి పోవాలి...? లేదంటే బాగుందంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించాడు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణ నుంచి ఎంపీపీ, జడ్పీటీ సీ భర్త కారులో ఎక్కి వెళ్తున్న క్రమంలో మహిపాల్‌రెడ్డి కారు అద్దాలను ఇటుకతో పగుల కొట్టడానికి ప్రయత్నించాడు. ఎంపీపీ, జడ్పీటీసీ భర్త చేసిన ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...