ఎయిర్‌ఫోర్స్‌లో చేరండి


Fri,September 6, 2019 12:07 AM

సంగారెడ్డి చౌరస్తా : విద్యార్థులు వాయుదళంలో చేరాలని వా యుసేనా కమాండింగ్ అధికారి యోగేష్ మెహ్లా పిలుపునిచ్చారు. గురువారం స్థానిక తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో భారత వాయుదళం-ఉద్యోగ అవకాశాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎయిర్‌మెన్ సెలక్షన్ సెంటర్ కమాండింగ్ అధికారి యోగేష్ మెహ్లా మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తరువాత యువతకు వాయు దళంలో అపారమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని సాధించేందుకు కృషి చేయాలన్నారు. వాయు దళంలో చేరితే అనేక సదుపాయాలు కేంద్రప్రభుత్వం నుంచి ఉంటాయని వివరించారు. పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియ, కేంద్ర ప్రభుత్వం నుంచి పొందే సదుపాయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రముఖర్జీ మాట్లాడుతూ యువత వాయు దళంలో చేరితే సామాజిక గౌరవంతో పాటు కఠిన పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం ఏర్పడుతుందని పేర్కొన్నారు. దేశ పౌరులుగా భారతదేశాన్ని కా పాడే అరుదైన అవకాశంతో పాటు భారత గడ్డపై జన్మించినందుకు భారతమాతకు సేవ చేసే భాగ్యం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్, కేరీర్ గైడె న్స్ సెల్ కన్వీనర్ డాక్టర్ వెంకటేశం, బేగంపేట్ ఏఎఫ్‌ఎస్ ఎండబ్ల్యువో నరేంద్రకుమార్, తహసీల్దార్ పరమేశ్, ఎన్‌ఎస్‌ఎస్ అధికారి డాక్టర్ జగదీశ్వర్, అధ్యాపకులు శ్రీనివాస్, షరీఫ్‌మియా, సంతోషి, విద్యార్థులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...