ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులు


Fri,September 6, 2019 12:07 AM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: ఉపాధ్యాయులు విద్యార్థులకే కాకుండా సమాజానికి కూడా మార్గదర్శకులు ఉండాలని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం హుస్నాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల స్థాయిలో జరిగిన గురుపూజోత్సవంలో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దడంతో పాటు సామాజిక చైతన్యంలోనూ ముందుండాలన్నారు. వచ్చే ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయుడు కృషి చేయాలని, పదికి పది జీపీఏ సాధించిన విద్యార్థులకు తనవంతుగా మంచి ప్రోత్సాహకం ఇస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం రెండు మండలాల్లో ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపికైన 14మందికి శాలువాలు, పూలమాలలు, ప్రశంసా పత్రాలతో ఘనంగా సన్మానించారు. అలాగే కోహెడ, బెజ్జంకి మండలాల్లో గురుపూజోత్సవాన్ని ఘనంగానిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, ఎంపీపీలు లకావత్ మానస, మాలోతు లక్ష్మి, జడ్పీటీసీ భూక్య మంగ, రైతు రుణ విమోచన కమిటీ సభ్యులు కవ్వ లకా్ష్మరెడ్డి, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, నేషనల్ లేబర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ డైరెక్టర్ దండుగుల రాజ్యలక్ష్మి, ఎంపీడీవో దమ్మని రాము, ఎంఈవో మారంపల్లి అర్జున్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వంగ వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...