ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు జరుపుకోవాలి


Fri,September 6, 2019 12:07 AM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ : వినాయక నిమజ్జన వేడుకలను సమన్వయంతో కలిసి ప్రశాంతంగా జరుపుకోవాలని హుస్నాబాద్ ఆర్డీవో అనంతరెడ్డి అన్నారు. గురువారం హుస్నాబాద్ పట్టణంలోని రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్‌లో పుర ప్రముఖులు, మండల అధికారులు, పోలీసులు, వినాయక మండపాల నిర్వాహకులతో కలిసి శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ వినాయక మండపాల నిర్వాహకులు, శాంతికమిటీ సభ్యులు, అధికారులు, పోలీసులు సమన్వయంతో కలిసి నిమజ్జన వేడుకలను విజయవంతంగా పూర్తి చేసుకోవాలన్నారు. నిమజ్జన వేడుకలకు అన్ని ఏర్పాట్లు సక్రమంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, తహసీల్దార్ దశరధ్‌సింగ్, మున్సిపల్ కమిషనర్, హుస్నాబాద్ ఎస్‌ఐ సుధాకర్, ఎక్సైజ్ శాఖ ఎస్‌ఐ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...