అంగన్‌వాడీల్లో సామూహిక సీమంతాలు


Fri,September 6, 2019 12:06 AM

అక్కన్నపేట : మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పోషణ్ అభియాన్ పథకం కింద గర్భిణులకు సామూహిక సీమంతాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోషక పక్షంలో భాగంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం పై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గర్భిణులకు పండ్లు, పూలు, స్వీట్లను అందజేశారు. సీడీపీవో జయమ్మ మాట్లాడుతూ పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి, ఉపసర్పంచ్ పీరెల్ల రాధ, ఎంపీటీసీ పెసరు సాంబరాజు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ యాక్‌పాషాబేగం, పలు అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.

హుస్నాబాద్‌రూరల్:మండలంలోని మహ్మదాపూర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం పోషణ్ అభియాన్ కింద చిన్నారులకు అన్నప్రాసణ, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం కల్పించారు. కేంద్రం ప్రభుత్వం చేపట్టిన పోషణ్ అభియాన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రేణుక, కోఆర్డినేటర్ శ్రీనివాస్, అంగన్‌వాడీ టీచర్లు తిరుమల, శ్రీలత, వార్డు సభ్యులు, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...