హుస్నాబాద్ జడ్పీపాఠశాల వసంతోత్సవంఘనంగా నిర్వహిద్దాం


Fri,September 6, 2019 12:06 AM

హుస్నాబాద్‌టౌన్: హుస్నాబాద్ జిల్లా పరిషత్ పాఠశాల 60 ఏండ్ల వసంతోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దామని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. పట్టణానికి చెందిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో గురుదక్షిణ కార్యక్రమం గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ మాట్లాడుతూ హుస్నాబాద్ జిల్లా పరిషత్ పాఠశాలకు ఘనమైన చరిత్ర ఉందని, ఇందులో చదివిన విద్యార్థులు ఉన్నతస్థానాలకు ఎదిగారని ప్రశంసించారు. పాఠశాల 60 ఏండ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా గురువు వరయోగుల తిరమలయ్యకు పూర్వ విద్యార్థులు, శ్రేయోభిలాషులు ఘనంగా సన్మానించి లక్షరూపాయలకుపైగా గురుదక్షిణ అందజేశారు.

కరీంనగర్ జేసీ గాజుల శ్యాంప్రసాద్‌లాల్ మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతానికి ప్రత్యేక విశిష్టత ఉందని, ఈ ప్రాంతపై తనకు ఎప్పుడు ప్రత్యేక అభిమానం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, రుణవిముక్తి కమిటీ సభ్యుడు కవ్వలకా్ష్మరెడ్డి, కార్మిక కో ఆపరేటివ్‌ఫెడరేషన్ డైరెక్టర్ దండుగుల రాజ్యలక్ష్మి, మార్కెట్‌కమిటీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, స్ఫూర్తిసంస్థ అధ్యక్షుడు పందిల్ల శంకర్, రిటైర్డ్ లేక్చరర్ డీవీఆర్‌నర్సయ్య, జర్నలిస్టులు కొండ లక్ష్మణ్, ఎండి. ఫజుల్హ్రమాన్, కవి, రచయిత అన్నవరం దేవేందర్, పూర్వ విద్యార్థి కొత్తపల్లి ఆశోక్, జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మనీల, ఎక్సైజ్ సీఐ అయిలేని శ్రీనివాసరెడ్డి, మాజీసర్పంచ్‌లు కేడం లింగమూర్తి, బొలిశెట్టి శివయ్యతోపాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తిరుమలయ్యను ఘనంగా సన్మానించారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...