వరాల జల్లు


Tue,July 23, 2019 12:20 AM

-సిద్దిపేటలోని ప్రతి గ్రామానికి రూ.50లక్షలు
-మూడు మండల కేంద్రాలకు ఒక్కో దానికి రూ.కోటి
-సిద్దిపేట మున్సిపాలిటీకి రూ.25 కోట్లు
-దుబ్బాక మున్సిపాలిటీకి రూ.10 కోట్లు
-రంగనాయకసాగర్ కట్ట పర్యాటక అభివృద్ధికి రూ.5 కోట్లు
సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ చింతమడక పర్యటనలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తూ వరాలజల్లు కురిపించారు. రాజకీయంగా పెంచింది.. దీవెనలు ఇచ్చింది.. సిద్దిపేట గడ్డనే.. మీరిచ్చిన విజయంతోనే రాష్ర్టాన్ని సాధించా.. ఈ గడ్డకు ఎంత చేసిన తక్కువేనని సీఎం కేసీఆర్ అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంతో పాటు దుబ్బాక పట్టణానికి నిధులు మంజూరు చేశారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు వినతి మేరకు సీఎం కేసీఆర్ ఈ నిధులను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. చింతమడక బంగారు తునక కావాలి. దీన్ని చూసి అందరూ నేర్చుకోవాలి. సిద్దిపేట నియోజకవర్గంలో 85 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో నంగునూరు, చిన్నకోడూరు, నారాయణరావుపేట మండల కేంద్రాలకు ఒక్కో దానికి రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. తాను విద్యాబుద్ధులు నేర్చుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గుడూరుకు, సిద్దిపేట రూరల్ మండలంలోని తోర్నాల, పుల్లూరు గ్రామాలకు రూ.కోటి చొప్పున మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.

సిద్దిపేట నియోజకవర్గంలోని 85 గ్రామ పంచాయతీల్లో 3మండల కేంద్రాలు, చింతమడక గ్రామం పోగా మిగిలిన 81 గ్రామాలకు ఎమ్మెల్యే హరీశ్‌రావు అడిగినట్లు ఒక్కో గ్రామానికి రూ.25లక్షలు కాకుండా రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రం కావడంతో అన్ని హంగులు ఉండాలి. ఇప్పటికే అన్ని హంగులు సంతరించుకున్నది. సిద్దిపేట మున్సిపాలిటీకి రూ.25 కోట్లు మంజూరు చేశారు. సిద్దిపేటను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే కోమటి చెరువును సుం దరీకరించుకున్నాం. ఇంకా ఈ ప్రాంతం పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు రంగనాయకసాగర్ కట్ట ను రూ.5కోట్లతో పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. తాను చదువుకున్న దుబ్బాక పట్టణానికి రూ.10కోట్లు మం జూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. చింతమడక అభివృద్ధి కోసం కలెక్టర్ వద్ద రూ.50 కోట్లు ఉంటాయని ఎమ్మెల్యే హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డిలు కలిసి ఈ నిధులను చింతమడక అభివృద్ధికి ఖర్చు చేయాలని సూచించారు. సిద్దిపేట ఇప్పటికే సమగ్రంగా అభివృద్ధి చెందిందని త్వరలోనే సిద్దిపేట పట్టణానికి వస్తానని ఒక రోజు ఆత్మీయులతో గడుపుతానని చెప్పారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...