విద్యాదానం గొప్పది: ఎంఈవో


Tue,July 23, 2019 12:17 AM

జగదేవ్‌పూర్: అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదని మండల విద్యాధికారి ఉదయభాస్కర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని దౌలాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆర్య వైశ్యసంఘం హైదరాబాదు ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు అరుణ్‌కుమార్ విద్యార్థులకు అవసరమైన నోట్‌బుక్‌లు అందించారు. అనంతరం హెచ్‌ఎం నరేందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఈవో మాట్లాడారు. దౌలాపూర్ ప్రభుత్వ పాఠశాలలకు దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. కార్యక్రమంలో ఆర్య వైశ్యసంఘం నాయకులు అంజయ్య, ప్రధానకార్యదర్శి శ్రీధర్, ఉప సర్పంచ్ భాస్కర్, విద్యాకమిటీ చైర్మన్ మహేందర్, ఉపాధ్యాయులు నాయకులు పాల్గొన్నారు.

యువత చేయూత అవసరం: ఎంఈవో రాములు
వర్గల్: యువజన సంఘాల ద్వారా గ్రామాల్లో చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వర్గల్ మండల విద్యాధికారి రాములు తెలిపారు. సోమవారం మండల పరిధిలోని సింగాయిపల్లి గ్రామంలో గివ్ ఫర్ సొసైటీ అనే సంస్థ ద్వారా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, పెన్నులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సంగీతావేణుగోపాల్, హెచ్‌ఎం నర్సింహారెడ్డి, ఉపాధ్యాయులు మహేశ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...