సాహో.. ఇస్రో


Tue,July 23, 2019 12:16 AM

గజ్వేల్ టౌన్: ప్రజ్ఞాఫూర్ సెయింట్ మేరీస్ విద్యానికేతన్ హైస్కూల్ విద్యార్థులు సోమవారం అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో చంద్రయాన్-2 ప్రయోగంను వీక్షించారు. అనంతరం చంద్రయాన్-2 ప్రయోజనాలను విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు తెలియజేశారు.

సొంత పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నాం
రష్యన్ల కన్నా అధునాతన టెక్నాలజీని పెంపొందించుకుని క్రయోజనిక్ ఇంజన్‌ను తయారు చేసుకున్నాం. భవిష్యత్తులో భూమిపై ఉన్న ఖనిజసంపదలు అయిపోతే చంద్రునిపై ఉండే వనరులను వినియోగించుకోవచ్చు. హీలియం లాంటి వనరులను పొందడానికి అవకాశం దక్కింది. వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించవచ్చు.
- నర్సింలు, ఉపాధ్యాయడు, గజ్వేల్ రూరల్

ప్రపంచ దేశాల సరసన భారత్
భారత దేశపు శాస్త్రవేత్తలు చంద్రయాన్-2ను విజయవంతంగా ప్రయోగించి అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన భారతదేశాన్ని నిలుపడం చాలా గర్వంగా ఉంది. శాస్త్ర పరిజ్ఞానంలో ప్రపంచ దేశాలకు ధీటుగా ప్రయోగాలు చేస్తున్న భారత శాస్త్ర వేత్తలకు ధన్యవాదాలు. భారత్ దేనిలోను వెనుకకు పొదాని నేడు ప్రపంచానికి చాటి చెప్పడం చాలా సంతోషంగా ఉంది.
-గొట్టం స్వామి, మిరుదొడ్డి

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...