రాష్ట్రం మొత్తం చింతమడక వైపు చూస్తుంది


Sun,July 21, 2019 11:31 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ: జిల్లాలో ఏ సభా సమావేశం... జరిగినా ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను అలాగే కొనసాగిద్దాం. రాష్ట్రం మొత్తం చింతమడక వైపు చూస్తున్నది. గ్రామంపై మరింత గౌరవం పెరిగేలా సీఎం కేసీఆర్ గ్రామ పర్యటన, సభా సమావేశం సజావుగా నిర్వహించేలా సమిష్టిగా కలిసి కృషి చేద్దామని జిల్లా అధికారులను ఎమ్మెల్యే హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డిలు కోరారు. ఆదివారం సమావేశ వేదిక వద్ద పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్, జేసీ పద్మాకర్, డీఆర్‌వో చంద్రశేఖర్, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులతో సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ స్వగ్రామానికి వస్తున్నారంటే పండుగ సంబురం నెలకొందని, అందుకు గ్రామస్తులంతా ఇంటి ముందు ముగ్గులు వేసి మామిడి ఆకులు, పూలదండలతో అలంకరిస్తున్నారని తెలిపారు. సభలో పాల్గొనే వారికి గులా అధికారులకు తెలుగు, మీడియా ప్రతినిధులకు గ్రీన్
ఐడెంటీ కార్డులు అందజేశామన్నా రు. గ్రామంలో 630 ఇండ్లకు గాను 30 ఇండ్లకు ఒకరు చొప్పున ఇన్‌చార్జిగా నియమించిన అధికారులు సభా, సమావేశం, సహపంక్తి భోజనాలు పూర్తయ్యే వరకు కేటాయించిన వారితోని ఉండాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో సీఎం కేసీఆర్ పర్యటన విజయవంతం చేద్దామని తెలిపారు. గ్రామస్తులను సభ వద్దకు తీసుకరావడంతో ఆత్మీయ సమ్మేళనం సమావేశం పూర్తయిన తరువాత సహపంక్తి వనభోజనాలు ముగిసే వరకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి సమావేశమయ్యారు. గ్రామంలోని యువకులు, కుల, మహిళా సంఘాల వారితో సమావేశమై వారికి అవగాహన కల్పించారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...