గ్రామాల్లో స్వచ్ఛభారత్


Sun,July 21, 2019 11:31 PM

జగదేవ్‌పూర్: మండలంలోని చాట్లపల్లి గ్రామంలో ఆదివారం ఉపసర్పంచ్ ఆజం ఆధ్వర్యంలో శ్రమదానం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా వార్డుసభ్యులు, సఫాయి కార్మికులు మహిళా సంఘం సభ్యులు, అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, గ్రామస్తులతో కలసి గ్రామంలోని పలువీధులను, ఊడ్చి పిచ్చి మొక్కలను తొలిగించారు. అనంతరం గ్రామంలో హరితహారంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జ్యోతి, వార్డు సభ్యులు అండాలు, బాలమణి, పరుశురాం, నాయకులు పాల్గొన్నారు.

గజ్వేల్‌లో స్వచ్ఛభారత్...
గజ్వేల్‌రూరల్: మండలపరిధిలోని బంగ్లావెంకటాపూర్, అక్కారం గ్రామాల్లో ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బంగ్లావెంకటాపూర్‌లో సర్పంచ్ బాపురెడ్డి, అక్కారంలో సర్పంచ్ బాల్‌చంద్రంల ఆధ్వర్యంలో ప్రజలు, యువకులు గ్రామంలోని వీధుల్లో చెత్తాచెదారాన్ని ఊడ్చి శుభ్రం చేశారు. అలాగే రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలను తొలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలు కూడా ముందుండాలన్నారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల ప్రజలు, యువకులు పాల్గొన్నారు.

రిమ్మనగూడలో యువకుల శ్రమదానం
గజ్వేల్‌టౌన్: మండలపరిధిలోని రిమ్మనగూడలో ఆదివారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రమదానం చేశారు. గ్రామంలోని వీధుల్లో రోడ్డుకిరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను తొలిగించారు. వానకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు సూచించారు. కార్యక్రమంలో యువకులు ఉన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...