ఆగయ్యగౌడ్‌కు హరీశ్‌రావు నివాళి


Sat,July 20, 2019 11:45 PM

చిన్నకోడూరు : చిన్నకోడూరు మండలం అల్లీపూర్ సర్పం చు బండిపల్లి రాజాబాయి భర్త బండిపల్లి ఆగయ్యగౌడ్ (మాజీ సర్పంచు) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అల్లీపూర్‌లోని వారి స్వగృహానికి వెళ్లి ఆగయ్యగౌడ్ మృతదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, ఎంపీపీ మాణిక్యరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ కీసరి పాపయ్య, మండల పార్టీ అధ్యక్షుడు కనకరాజు, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీ లచ్చయ్య, మాజీ సర్పంచు రాజేశంగౌడ్ తదితరులు ఉన్నారు.

గుండారంలో రెడ్డి సంఘం ఎన్నికలు
బెజ్జంకి: మండలంలోని గుండారం గ్రామంలో రెడ్డి సంక్షేమ సంఘ ఎన్నికలను శనివారం నిర్వహించారు. అధ్యక్షుడిగా ఎలుకంటి రాజిరెడ్డితోపాటు సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...