జిల్లాలో భారీగా పాలసేకరణ


Fri,July 19, 2019 11:58 PM

గజ్వేల్ రూరల్: గతం కన్నా జిల్లాలో ప్రస్తుతం పాల సేకరణ పెరిగిందని విజయ డెయిరీ సిద్దిపేట, కరీంనగర్ పాల పరిధి డిప్యూటీ డైరెక్టర్ మోహన్ మురళి అన్నారు. శుక్రవారం ఆయన గజ్వేల్‌కు వచ్చిన సందర్భంగా గజ్వేల్ పాలశీతలీకరణ కేంద్రంలో మేనేజర్ రాధికతో కలిసి నమస్తే తెలంగాణతో మాట్లాడారు. పాడిపశువుల పెంపకంపై గతం కన్నా ప్రస్తుతం రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారన్నారు. జిల్లాలో 58రూట్లలో మొత్తం 415గ్రామాల్లో పాడిరైతులతో పాల ఉత్పత్తిదారుల సంఘాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ సంఘాల్లో 12,774మంది పాడిరైతుల నుంచి ప్రతి రోజు 40వేల లీటర్ల చొప్పున పాలను సేకరిస్తున్నామని, గతం కన్నా 6వేల లీటర్ల సేకరణ పెరిగిందన్నారు. జిల్లాలోని పాడిరైతులకు పాలసేకరణకు గానూ ప్రతి నెలా రూ.4.50 కోట్ల బిల్లులు చెల్లిస్తున్నామని, కేవలం గజ్వేల్ పాలశీతలీకరణ కేంద్రం పరిధిలోనే నెలకు రూ.65లక్షల బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. పాడిరైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రతి 10రోజులకోసారి బిల్లులు చెల్లించడం జరుగుతుందన్నారు. గతంలో సాధారణంగా 36వేల లీటర్ల పాలు సేకరించగా, ప్రస్తుతం 40వేల లీటర్లను పాలు సేకరిస్తున్నామని, సీజన్‌లో 65వేల లీటర్ల పాలను ప్రతి రోజు సేకరిస్తున్నామన్నారు. గేదెపాలకు రూ.41లు, ఆవు పాలకు రూ.31లు చెల్లిస్తున్నామన్నారు. 2017-18లో 13.54లక్షల లీటర్ల పాలు సేకరించగా, 2018-19లో 14.63లక్షల లీటర్ల పాలను సేకరించామన్నారు.
10రోజుల్లో దౌల్తాబాద్‌లో బీఎంసీ
దౌల్తాబాద్‌లో మరో పది రోజుల్లో 5వేల లీటర్ల సామర్థ్యం కలిగిన చిన్నతరహా పాలశీతలీకరణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు మోహన్ మురళి తెలిపారు. అలాగే జిల్లాలో ఎనిమిది విజయ డెయిరీ పాల ఉత్పత్తుల అమ్మకం కేంద్రాలను ఏర్పాటు చేశామని, గజ్వేల్ పాలశీతలీకరణ కేంద్రం వద్ద కూడా విజయ పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. అలాగే పాడి రైతులకు పశుపోషణకు ఇబ్బందులు కలుగకుండా గడ్డి విత్తనాలు, నట్టల నివారణ మందులు, మినరల్ మిక్చర్, వ్యాధుల నివారణకు వ్యాక్సిన్లు, పశువుల దాణాను సబ్సిడీపై అందిస్తున్నామన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...