పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలి


Fri,July 19, 2019 11:57 PM

సిద్దిపేట టౌన్ : ఫిర్యాదుదారుల పట్ల పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని, చట్టపరంగా వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ ఆదేశిం చారు. కమిషనరేట్ కార్యాలయంలో రిసెప్షనిస్టు, కానిస్టేబుళ్లకు ఒక రోజు శిక్షణ శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో పోలీస్‌స్టేషన్లలో అధికారులకు, సిబ్బందికి వర్టికల్ వారీగా విధు లు కేటాయించామని తెలిపారు. పోలీస్‌స్టేషన్లకు వచ్చే దరఖాస్తులను స్వీకరించి, నేరం జరిగిన తీరును ఎక్కడ? ఎప్పుడు? ఎందుకు? ఎలా? జరిగిందో అనే విషయాలను ఖచ్చితంగా దరఖాస్తులో ఉండేట్లు చూడాలని, ఆ బాధ్యత రిసెప్షనిస్టులదేనని చెప్పారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మంచిగా మసులుకొని వారి సమస్యలు అడిగి తెలుసుకొని సమస్య పరిష్కారమవుతుందని భరోసా కల్పించాలన్నారు. రిసెప్షనిస్టులు దరఖాస్తులపై తప్పనిసరిగా పిటిషన్ మేనేజ్‌మెంట్‌లో జనరేట్ చేసి రిసెప్ట్ ఇవ్వాలని సూచించారు. అనంతరం సీసీటీఎన్‌ఎస్ ప్రజెక్టు ద్వారా పిటిషన్ మేనేజ్‌మెంట్‌లో ఎంటర్ చేయాలని, ఎంక్వైర్ రిపోర్టు, స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలన్నారు. క్రమశిక్షణ, సమయపాలన, వృత్తిపట్ల నిబద్ధత, పోలీసులందరూ కలిగి ఉండాలని ఆదేశించారు. పోలీసులు విధులు నిర్వర్తించడంలో నిజాయితీ, పారదర్శకంగా, జవాబుదారితనంగా ఉండాలని, అన్ని పోలీస్‌స్టేషన్లలో పంచసూత్రాలు అమలుపర్చాలన్నారు. నిజాయితీగా పనిచేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని, సిబ్బంది, అధికారుల ఉత్తమ పనితీరుతో రివార్డులను ప్రతినెలా అందిస్తున్నామని సీపీ జోయల్ డెవిస్ వివరించారు.

పోలీస్ ఉద్యోగిగా ప్రజల సమస్యలు తీర్చడానికి అవకాశం రావం గొప్ప అదృష్టంగా భావించాలన్నారు. విధి నిర్వహణలో మానవీయ కోణం ఆదరణ వంటి లక్షణాలు పోలీస్ ఉద్యోగిని ఉన్నతస్థాయిలో నిలబెడుతాయని తెలిపారు. ఉద్యోగమంటే అధికారం కాదని, బాధ్యత అని తెలుసుకోవాలని సూచించారు. ప్రెండ్లీ పోలీసింగ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లి వారితో మమేకం కావాలన్నారు. మన పరిధిలో కాకుండా వేరే పోలీస్‌స్టేషన్‌లో నేరం జరిగినట్లు దరఖాస్తు వస్తే జాప్యం లేకుండా దరఖాస్తులు స్వీకరించి రసీదు ఇవ్వాలన్నారు. అనంతరం ఆ పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు దరఖాస్తును బదిలీ చేయాలని, తద్వారా ప్రజలకు పో లీస్ వ్యవస్థపై మంచి అభిప్రాయం ఏర్పడుతుందని చెప్పారు. సిద్దిపేట కమిషనరేట్‌కు మంచిపేరు తీసుకవచ్చే బాధ్యత రిసెప్షనిస్టులపై ఉందని తెలిపారు. అంతకు ముందు 100 కాల్స్, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, సీసీటీఎన్‌ఎస్ ప్రాజెక్టు, టీఎస్ కాప్, రిసెప్షన్ వర్టికల్ నోడల్ అధికారి, సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, ఐటీ కోర్ సిబ్బంది శశికాంత్, శ్రీకాంత్, శ్రీధర్, పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో ఎంట్రీని సిబ్బందితో చేయించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, రిసెప్షన్ వర్టికల్ నోడల్ అధికారి, సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, ఐటీకోర్ సిబ్బంది పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...